AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది బీజేపీ కుట్ర ! న్యాయవ్యవస్థపై మాకు నమ్మకం ఉంది, ‘ఈ కేసు నుంచి బయట పడతాం ‘,బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీమ్,

తమను అరెస్టు చేయించి జైలుకు తరలించడం బీజేపీ కుట్రేనని బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీమ్ అన్నారు. మమ్మల్ని వేధించడానికి ఆ పార్టీ ఏమైనా చేస్తుంది అని ఆయన ఆరోపించారు.

ఇది బీజేపీ కుట్ర ! న్యాయవ్యవస్థపై మాకు నమ్మకం ఉంది, 'ఈ కేసు నుంచి బయట పడతాం ',బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీమ్,
Bengal Minister Firhad Haki
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: May 18, 2021 | 2:20 PM

Share

తమను అరెస్టు చేయించి జైలుకు తరలించడం బీజేపీ కుట్రేనని బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీమ్ అన్నారు. మమ్మల్ని వేధించడానికి ఆ పార్టీ ఏమైనా చేస్తుంది అని ఆయన ఆరోపించారు. నారదా కేసులో హకీమ్ తో బాటు మరో మంత్రి సుబ్రతా ముఖర్జీని, ఎమ్మెల్యే మదన్ మిత్రాను, పార్టీ మాజీ నేత సోవన్ ఛటర్జీని సీబీఐ అధికారులు అరెస్టు చేసి జైలుకు తరలించిన విషయం గమనార్హం. ఈ పాండమిక్ సమయంలో ప్రజలకు సేవ చేయాల్సిన నేను ఆ అవకాశాన్ని పొందలేకపోయానని పార్టీ మాజీ నేత కోల్ కతా మాజీ మేయర్ అయిన సోవన్ ఛటర్జీ విలపిస్తూ అన్నారు. కాగా తమపై చర్య తీసుకున్నారని, మరి ఆ ఇద్దరిపై (సువెందు అధికారి, ముకుల్ రాయ్) పై ఎందుకు చర్య తీసుకోలేదని మదన్ మిత్ర ప్రశ్నించారు. మేము చెడ్డవారం, వాళ్లిద్దరూ మంచి వారా అని ఆయన వ్యాఖ్యానించారు. అటు. జైలు బయట వీరి కుటుంబ సభ్యులు కూడా కొద్దిసేపు వేచి ఉన్నారు. ఈ నలుగురు నిందితులను తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు జ్యూడిషియల్ కస్టడీలో ఉంచాలని కలకత్తా హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశించింది. ఇలా ఉండగా నిన్న సీబీఐ కార్యాలయానికి వెళ్లి అంత హడావుడి చేసిన సీఎం మమతా బెనర్జీ తాజా పరిణామాలపై మౌనంగా ఉన్నారు. దమ్ముంటే తనను కూడా అరెస్టు చేయాలని సీబీఐకి సవాల్ విసిరిన ఆమె.. ఈనలుగురినీ జైలుకు పంపడంపై స్పందించలేదు. కలకత్తా హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె మౌనమే మంచిదని భావించినట్టు ఉందని అంటున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Income Tax: ఈ-వాలెట్, యూపీఐతో షాపింగ్ చేసినట్లయితే ట్యాక్స్‌ చెల్లించాలా..? నిబంధనలు ఏం చెబుతున్నాయి

తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం.. జూనియ‌ర్ డాక్ట‌ర్ల‌కు స్టైఫండ్ పెంపుతూ ఉత్త‌ర్వులు