వైసీపీ నాయకులూ కాస్త జాగ్రత్తగా మాట్లాడండి: జనసేన పార్టీ

సోషల్ మీడియా పోస్ట్‌ రెండు రాజకీయ పార్టీల మధ్య అగ్గి రాజేసిందా? పార్టీ సామాజిక మాధ్యమంలో జరిగే ప్రచారానికి అధికార పార్టీ సమాధానం ఇవ్వాల్సిందేనా ? ఎన్నికలు, ఓట్లు, ఫలితాలు అయిపోయిన తర్వాత బ్లాక్‌ అండ్‌ వైట్‌ మనీ వ్యవహారం తెరపైకి రావడానికి ప్రధాన కారణం ఏమిటి ? వైసీపీ, జనసేన పార్టీల మధ్య కొత్త వివాదం జరుగుతోంది. ఏపీ అధికార పార్టీ వైసీపీ సోషల్‌ మీడియాలో వచ్చిన పోస్టే ఇందుకు ఆజ్యం పోసింది. రాజకీయపరమైన విమర్శలు […]

వైసీపీ నాయకులూ కాస్త జాగ్రత్తగా మాట్లాడండి: జనసేన పార్టీ
Follow us

| Edited By:

Updated on: Aug 24, 2019 | 11:08 AM

సోషల్ మీడియా పోస్ట్‌ రెండు రాజకీయ పార్టీల మధ్య అగ్గి రాజేసిందా? పార్టీ సామాజిక మాధ్యమంలో జరిగే ప్రచారానికి అధికార పార్టీ సమాధానం ఇవ్వాల్సిందేనా ? ఎన్నికలు, ఓట్లు, ఫలితాలు అయిపోయిన తర్వాత బ్లాక్‌ అండ్‌ వైట్‌ మనీ వ్యవహారం తెరపైకి రావడానికి ప్రధాన కారణం ఏమిటి ?

వైసీపీ, జనసేన పార్టీల మధ్య కొత్త వివాదం జరుగుతోంది. ఏపీ అధికార పార్టీ వైసీపీ సోషల్‌ మీడియాలో వచ్చిన పోస్టే ఇందుకు ఆజ్యం పోసింది. రాజకీయపరమైన విమర్శలు కాకుండా… ఏకంగా పార్టీ అధ్యక్షుడు, నాయకులపై ఆర్ధికపరమైన ఆరోపణలు ఆ పోస్టులో ఉండటమే జనసైనికుల్ని ఆగ్రహానికి గురి చేసింది. అయితే దీనికి అడ్డుకట్ట వేయాలని భావించిన జనసేనికులు చట్టపరంగా ముందుకెళ్తున్నారు.

ఫ్యాను గుర్తు పార్టీకి గాజు గ్లాసు పార్టీకి మధ్య అగ్గిరాజుకుంది. వైసీపీకి చెందిన వైసీపీ సోషల్‌ మీడియా విభాగంలోని వ్యక్తులే ఇందుకు కారణమని జనసేన పార్టీ ప్రధానంగా ఆరోపిస్తోంది. వాళ్లు పోస్ట్‌ చేసిన దాంట్లో జనసేన అధ్యక్షుడు పవన్‌బర్త్‌డే సందర్భంగా 2 వేల కోట్ల రూపాయల బ్లాక్‌మనీని వైట్‌మనీగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని వైసీపీ సోషల్‌ మీడియా వింగ్‌ ఘాటైన ఆరోపణలు చేసింది. పుట్టిన రోజు వేడుకల కోసం అని అభిమానులు, జనసేన శ్రేణులు చందాలు వసూలు చేసి ఆ పెద్దమొత్తాన్ని మొత్తం వైట్‌లోకి మార్చుకునేందుకు ప్లాన్‌ చేస్తున్నారని పోస్ట్‌లో పేర్కొన్నారు. అంతే కాదు.. ఈ విరాళాల్లో చంద్రబాబు సైతం కొంత డబ్బులు ఇచ్చారనే ఆరోపణలు చేస్తోంది వైసీపీ.

అగస్ట్‌ 20వ తేదిన రాత్రి 9.55 గంటలకు వైసీపీ సోషల్‌ మీడియా వింగ్‌లో ఈ పోస్ట్‌ పెట్టడంపై జనసేన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తమ పార్టీని ఆదిలోనే తుంచిపారేయాలని.. వైసీపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందంటున్నారు. నిరాధారం, సాధ్యం కాని విషయాలపై వైసీపీ సోషల్‌ మీడియా వింగ్‌ ఆరోపణలు చేయడం ఎంత వరకు సమంజసమని ఆపార్టీ నేత హరిప్రసాద్‌ ప్రశ్నించారు.

ఇప్పుడే మొదలైన ఈ వివాదంపై ఇప్పటి వరకూ అధికార పార్టీ స్పందించలేదు. కానీ జనసేన విమర్శల్ని వైసీపీ ఎలా తిప్పి కొడుతుందో చూడాలి.