డింపుల్ యాదవ్‌కి షాక్ : పోలింగ్‌ను బహిష్కరించిన కన్నౌజ్ ప్రజలు

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించారు. అభివృద్ది పనులేవి చేపట్టలేదన్న అసంతృప్తితో ఉన్న ఓటర్లకు.. పోలింగ్ బూత్‌లను మార్చడం మరింత ఆగ్రహం తెప్పించింది. దీంతో ఓటింగ్‌ను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. స్థానికుల నిర్ణయం సిట్టింగ్ ఎంపీ, ఎస్పీ అధినేత అఖిలేశ్ సతీమణి డింపుల్ యాదవ్‌కు షాక్ అనే చెప్పాలి. వరుసగా ఐదుసార్లు కన్నౌజ్‌లో ఎస్పీయే గెలిచినప్పటికీ.. అక్కడ అభివృద్ది జరగలేదని స్థానికులు చెబుతుండటం ఆ పార్టీకి ప్రతికూలంగా పరిణమించే అవకాశం కనిపిస్తోంది. 1998 నుంచి కన్నౌజ్‌లో ఎస్పీ జెండా […]

డింపుల్ యాదవ్‌కి షాక్ : పోలింగ్‌ను బహిష్కరించిన కన్నౌజ్ ప్రజలు

Updated on: Apr 29, 2019 | 1:20 PM

ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించారు. అభివృద్ది పనులేవి చేపట్టలేదన్న అసంతృప్తితో ఉన్న ఓటర్లకు.. పోలింగ్ బూత్‌లను మార్చడం మరింత ఆగ్రహం తెప్పించింది. దీంతో ఓటింగ్‌ను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. స్థానికుల నిర్ణయం సిట్టింగ్ ఎంపీ, ఎస్పీ అధినేత అఖిలేశ్ సతీమణి డింపుల్ యాదవ్‌కు షాక్ అనే చెప్పాలి. వరుసగా ఐదుసార్లు కన్నౌజ్‌లో ఎస్పీయే గెలిచినప్పటికీ.. అక్కడ అభివృద్ది జరగలేదని స్థానికులు చెబుతుండటం ఆ పార్టీకి ప్రతికూలంగా పరిణమించే అవకాశం కనిపిస్తోంది.

1998 నుంచి కన్నౌజ్‌లో ఎస్పీ జెండా ఎగురుతూనే ఉంది. 1999లో ములాయం ఇక్కడి నుంచి గెలుపొందగా.. 2000,2004,2009లో అఖిలేశ్ గెలుపొందారు. 2014 ఎన్నికల్లో అఖిలేశ్ సతీమణి డింపుల్ యాదవ్ పోటీ చేసి.. బీజేపీ అభ్యర్థిపై 19వేల మెజారిటీతో గెలిచారు. ఎస్పీకి ఇంతలా పట్టున్న నియోజకవర్గంలో స్థానికుల నుంచి పార్టీ పట్ల వ్యతిరేక అభిప్రాయం వ్యక్తమవడం అఖిలేశ్‌కు ఆందోళన కలిగించే విషయమే. ఇదిలా ఉంటే, నేడు జరుగుతున్న నాలుగో విడత ఎన్నికల్లో బాగంగా 9 రాష్ట్రాల్లోని 72 లోక్‌సభ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్ మినహా మిగతా రాష్ట్రాల్లో పోలింగ్ ప్రశాంతంగానే సాగుతోంది.