Gudivada: ఏపీ రాజకీయాల్లో బిగ్ బ్రేకింగ్.. కొడాలి నానిపై పోటీకి వంగవీటి రాధా సై.. స్నేహానికి ఎండ్ కార్డ్

|

Sep 22, 2021 | 9:22 PM

ఏపీ రాజకీయాలకు సంబంధించి బిగ్ న్యూస్ అందుతోంది. ముఖ్యంగా కృష్ణా జిల్లా రాజకీయాలకు సంబందించి ఇది ప్రకపంనలు రేపే వార్త.

Gudivada: ఏపీ రాజకీయాల్లో బిగ్ బ్రేకింగ్.. కొడాలి నానిపై పోటీకి వంగవీటి రాధా సై.. స్నేహానికి ఎండ్ కార్డ్
Nani Vs Radha
Follow us on

ఏపీ రాజకీయాలకు సంబంధించి బిగ్ న్యూస్ అందుతోంది. ముఖ్యంగా కృష్ణా జిల్లా రాజకీయాలకు సంబందించి ఇది ప్రకపంనలు రేపే వార్త. ఏపీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిని ఢీ కొట్టేందుకు వంగవీటి రంగా సిద్దమవుతున్నారు. ఇందుకు సంబంధించి ఆయన అనధికార స్టేట్మెంట్ ఇచ్చేశారు. 2024 ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీ చేసేందుకు వంగవీటి కసరత్తులు షురూ చేశారు. గుడివాడలోని కాపు సామాజికవర్గం నేతలతో రాధా వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. గుడివాడ కాపు సామాజికవర్గంతో వంగవీటి కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో అక్కడ ఉన్న సన్నిహితులకు తాను రాబోయే ఎన్నికల్లో గుడివాడ నుంచి పోటీచేస్తాననే సంకేతాలిచ్చారు రాధా. గుడివాడ గడ్డపై నానిని మట్టికరిపిస్తానని సన్నిహితులతో వంగవీటి రాధా చెప్పినట్లు తెలుస్తోంది. టీడీపీని ఎట్టి పరిస్థితుల్లో విడిచే ప్రసక్తి లేదని, రాజకీయాల్లో తినాల్సిన ఎదురుదెబ్బలన్నీ తిన్నానని కార్యకర్తల వద్ద రాధా చెప్పారట. తన నుంచి ఇకపై పరిణితి చెందిన రాజకీయాలు చూస్తారని, రంగా ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారట. బడుగు, బలహీనవర్గాలకు ఎల్లప్పుడూ వంగవీటి కుటుంబం అండగా ఉంటుందని, తనను నమ్మినవారి కోసం ఎందాకైనా వెళ్లేందుకు సిద్దమని రాధా చెప్పారట.

కాగా వంగవీటి రాధా, కొడాలి నాని దశాబ్దాలుగా మిత్రులుగా ఉన్నారు. ఏ పార్టీలో ఉన్నా సరే వారి ఫ్రెండ్షిప్ ఏనాడు చెక్కుచెదరలేదు. కానీ తాజాగా వారి మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది. కాగా గుడివాడ నానికి కంచుకోటగా ఉంది. గత నాలుగు సార్లు ఆయన అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. కొడాలి నానిని ఢీకొట్టేందుకు కొంతకాలంగా టీడీపీ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పటికే గత ఎన్నికల్లో విజయవాడకు చెందిన దేవినేని అవినాష్ ను రంగంలోకి  టీడీపీ ఘోరంగా ఫెయిల్ అయ్యింది.మాటల తూటాలు విసరడంలో కూడా వంగవీటి అయితేనే సమర్థుడని టీడీపీ భావిస్తోందట. మరి ఈ పాచిక ఎంతమేర పారుతుందో చూడాలి.

Also Read: సంక్షేమమే అజెండా… అక్టోబర్‌లో వారందరికీ సీఎం జగన్ వరాలు

 పైశాచికానందం.. భార్య ఉరివేసుకుంటుంటే పక్కనే ఉండి వీడియో చిత్రీకరించిన భర్త