Nellore District: పైశాచికానందం.. భార్య ఉరివేసుకుంటుంటే పక్కనే ఉండి వీడియో చిత్రీకరించిన భర్త
దీన్ని దారుణం అనాలో, ఘోరం అనాలో కూడా తెలియడం లేదు. నెల్లూరులో భర్త శాడిజానికి భార్య బలైపోయింది. క్షణికావేశంలో చనిపోతాను అంటేనే ఎవ్వరైనా వద్దని వారిస్తారు.
దీన్ని దారుణం అనాలో, ఘోరం అనాలో కూడా తెలియడం లేదు. నెల్లూరులో భర్త శాడిజానికి భార్య బలైపోయింది. క్షణికావేశంలో చనిపోతాను అంటేనే ఎవ్వరైనా వద్దని వారిస్తారు. బలవంతంగా అయినా వారిని ఆపే ప్రయత్నం చేస్తారు. కానీ పెంచలయ్య అనే వ్యక్తి మాత్రం తన భార్య కొండమ్మ ఉరివేసుకుంటుంటే ఆనందంగా అదేపనిగా చూశాడు. ఫోన్‌లో చిత్రీకరిస్తూ పైశాచికానందం పొందాడు. ఆమె ఊపిరి అందక కొట్టుమిట్టాడుతున్న సమయంలో కూడా అతడి మనసు కరగలేదు. దీంతో ఊరివేసుకుని భర్త కళ్లముందే కొండమ్మ ప్రాణాలు విడిచింది. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని జే.ఆర్ పేట కాలనీలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. భార్య సూసైడ్ చేసుకుంటే భర్త సినిమా చూసినట్టు చూశాడు. ఆపే ప్రయత్నమే చేయలేదు. చివరకు గొంతుకి చీర బిగుసుకుపోయి కొండమ్మ ప్రాణాలు విడిచింది. ఫ్యాన్‌కి చీరకట్టి మెడకు వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చివరకు గిలగిలా కొట్టుకుంటూ చనిపోయింది. కాగా పెంచలయ్య ప్రవేటు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. కొండమ్మ మెప్మాలో రిసోర్స్ పర్సన్‌గా పనిచేసేంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. కాగా పెంచలయ్య అనుమానంతో నిత్యం భార్య కొండమ్మను వేధిస్తున్న నేపథ్యంలో.. తాళలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ ఘటనకు సంబంధించి వీడియో ఉన్నప్పటికీ.. అది మిమల్ని కలిచివేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ విజువల్స్ అందుబాటులో ఉంచడం లేదు.
Also Read: అమ్మ ఎగ్ దోశ తినేందుకు డబ్బులివ్వలేదని.. ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య