Kishan Reddy Coments : మాజీ మంత్రి ఈటల ఎపిసోడ్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇప్పటివరకు ఈటల రాజేందర్ తనను కలవలేదని తెలిపారు. అయితే తనను ఈటల కలిసేందుకు చూసిన మాట వాస్తవమే అన్నారు. అంతేకాకుండా ఈటల తాను కలిసి పదిహేను ఏళ్లు పనిచేశామని కలిస్తే తప్పేముంటుందని ప్రశ్నించారు..కలిసినంత మాత్రాన పార్టీలో చేరుతారని ఎలా అనుకుంటారని అన్నారు. అయితే ఎప్పుడు కలుస్తామనేది ఇంకా నిర్ణయించుకోలేదని స్పష్టం చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక వస్తే పోటీలో ఉండాలా వద్దా అనేది చర్చించలేదన్నారు. పార్టీ నేతలతో చర్చించాకే నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించారు.
ఇదిలాఉండగా, ఈటల రాజేందర్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అపాయింట్ మెంట్ కోరారని, త్వరలోనే బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ సందర్భంగా కేంద్రమంత్రి క్లారిటీ నిచ్చారు. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన ఈటల తన అనుకూల నేతలను కలుస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి బయటకొచ్చిన చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో రహస్య మంతనాలు జరిపిన విషయం తెలిసిందే. అనంతరం పలువురు బీజేపీ నేతలను కూడా కలిశారు.