రాశులు-రాజకీయాలు.. రాజకీయ నేతలు. శోభకృత్ నామ సంవత్సరంలో పొలిటికల్ పంచాంగం ఏం చెబుతోంది? తెలుగు రాష్ట్రాల్లో ఏ లీడర్ భవిష్యత్ ఏంటి? వాళ్ల రాశి ఏంటి? రాజకీయాల్లో వాళ్ల హస్తవాసి ఏంటి? జగన్ జాతకం ఏంటి? బాబు భవిష్యత్ ఏంటి? కేసీఆర్ రాశి ఏం చెబుతోంది. పవన్ రాశిలో పొత్తులు-ఎత్తుల వ్యూహాల గురించి ప్రస్తావన ఉందా? రెండు రాష్ట్రాల్లో ఫ్లవర్ పార్టీ ఫ్లేవర్‌పై పొలిటికల్ పంచాంగకర్తలు ఏమంటున్నారు. ఇక కాంగ్రెస్ హస్తవాసి గురించి రాజకీయ రాశి ఏమంటోంది?
కొత్త ఏడాది కొత్త ఆశలను, సరికొత్త కలలను తీసుకొచ్చింది. మనలో కొంగొత్త ఆకాంక్షలను తట్టి లేపుతోంది. మరి మన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతల రాశులు, రాజకీయాలు ఎలా ఉన్నాయి? పొలిటికల్ పంచాంగం ఏం చెబుతోంది. నేతల రాశి ఫలాలు ఎలా ఉన్నాయి. ఏపీ సీఎం జగన్ జాతకం ఎలా ఉంది? ఆయన రాజకీయ రాశి-వాశి ఎలా ఉండబోతున్నాయి? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతకంలో ఉన్న యోగాలేంటి? ఆయన రాజకీయ రాశి ఎలా ఉంది? టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రాశిలో ఎలాంటి ఆసక్తికర విషయాలు దాగి ఉన్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రాశిలో పొత్తులు-ఎత్తుల గురించి ఏమైనా ఉందా? టీడీపీకి, జనసేనకు మధ్య గ్రహ మైత్రి కలిగి రాజకీయ అనుగ్రహ మైత్రికి రహదారి పడుతోందా? ఏపీ బీజేపీ నేత మాధవ్ ఆరోపించినట్టు బీజేపీకి జనసేన దూరంగా జరుగుతూ టీడీపీకి దగ్గరవుతోందా?
తెలంగాణలో విపక్షాల పరిస్థితేంటి. కాషాయ దళాన్ని బండెనక బండి కట్టి నడిపిస్తున్న బండి సంజయ్ జాతకంలో ఈ ఏడాది ఏముంది. పాదయాత్రతో టీ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపుతున్న రేవంత్ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి. ఈడీ విచారణను ధైర్యంగా ఎదుర్కొంటూ వార్తల్లో వ్యక్తిగా మారిన కవితక్క జాతకంలో ఇంటరెస్టింగ్ పాయింట్స్ ఏంటి? కేటీఆర్, హరీష్‌ల రాశులు ఏమంటున్నాయి? వైఎస్సార్‌టీపీ అధ్యక్షరాలు షర్మిల రాశి ప్రకారం ఆమె రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? ఇక అటు ఏపీలో విపక్ష నేతల రాజకీయ రాశులు ఎలా ఉన్నాయి? ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు రాజకీయ రాశి ఏం చెబుతోంది?
ఆదాయం – 2, వ్యయం – 11
రాజపూజ్యం – 2, అవమానం – 4
ఏపీ సీఎం వైఎస్ జగన్‌ది మిథునరాశి. ఈ ఏడాది ఆయనకు ఆదాయం 2 అయితే వ్యయం 11 ఉంది. ఇక రాజపూజ్యం 2, అవమానం 4 అని రాశి ఫలాలు చెబుతున్నాయి.
ఆదాయం – 11, వ్యయం – 8
రాజపూజ్యం – 5, అవమానం – 4
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ది కర్కాటక రాశి. ఈ ఏడాది ఆయనకు ఆదాయం 11 అయితే, వ్యయం 8 ఉంది. ఇక రాజపూజ్యం 5 అయితే అవమానం 4.
ఆదాయం – 11, వ్యయం – 8
రాజపూజ్యం – 5, అవమానం – 4
టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబుది కర్కాటక రాశి. ఆయనకు ఈ ఏడాది 11 ఆదాయం ఉంటే వ్యయం 8 ఉంది. ఇక రాజపూజ్యం 5, అవమానం 4 అంటున్నాయి రాశులు.
ఆదాయం – 11, వ్యయం – 5
రాజపూజ్యం – 2, అవమానం – 6
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు ఈ ఏడాది ఆదాయం 11, వ్యయం 5 ఉంటే రాజపూజ్యం 2, అవమానం 6 అంటోంది మకర రాశి.
ఆదాయం – 14, వ్యయం – 11
రాజపూజ్యం – 6, అవమానం – 1
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఈ ఏడాది ఆదాయం 14 అయితే వ్యయం పదకొండట. ఇక ఆయనకు రాజపూజ్యం 6 అయితే అవమానం ఒకటే అంటోంది వృషభ రాశి.
ఆదాయం – 2, వ్యయం – 11
రాజపూజ్యం – 4, అవమానం – 7
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ది కన్యా రాశి. ఈ సంవత్సరం ఆయన ఆదాయం 2, వ్యయం మాత్రం చాలా ఎక్కువగా 11 ఉంది. ఇక రాజపూజ్యం 4 అయితే అవమానం7.
ఆదాయం -14, వ్యయం – 11
రాజపూజ్యం – 7, అవమానం – 7
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిది తులా రాశి. ఆయనకు ఈ ఏడాది ఆదాయం 14, వ్యయం11 ఉన్నాయి. ఇక రాజపూజ్యం 7, అవమానం 7 అంటోంది తులా రాశి.
ఆదాయం – 11, వ్యయం – 5
రాజపూజ్యం – 2, అవమానం – 6
ఇక తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఆదాయం 11, వ్యయం 5 అయితే రాజపూజ్యం 2, అవమానం 6 అంటోంది మకర రాశి.
ఆదాయం – 11, వ్యయం – 5
రాజపూజ్యం – 2, అవమానం – 6
తెలంగాణకే చెందిన మరో మంత్రి హరీష్‌రావుది కూడా మకర రాశే కావడం విశేషం. ఆయనకు ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6 అంటోంది మకర రాశి.
ఆదాయం – 5, వ్యయం – 5
రాజపూజ్యం – 3, అవమానం – 1
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈ ఏడాది ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1 అంటోంది మేష రాశి.
ఆదాయం – 5, వ్యయం – 5
రాజపూజ్యం – 3, అవమానం – 1
యువగళం పాదయాత్రతో ముందుకు సాగుతున్న టీడీపీ నేత లోకేష్‌కి ఈ ఏడాది ఆదాయం 5, వ్యయం 5. రాజపూజ్యం 3, అవమానం ఒకటి అంటోంది మేష రాశి.
ఆదాయం – 2, వ్యయం – 11
రాజపూజ్యం – 4, అవమానం – 7
వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలకు ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7 అంటోంది కన్యా రాశి.
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నేతల రాశులు ఎలా ఉన్నాయో పంచాంగం చెబుతుంటే.. రాజకీయాల్లో వారి హస్తవాసులు ఎలా ఉండబోతున్నాయో ప్రజా పంచాంగంలో తెలుస్తుందంటున్నారు తలలు పండిన పొలిటికల్ పండిట్స్.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..