టీటీడీపీ ‘ ఖేల్ ‘ ఖతం…. భవితవ్యం శూన్యం !

తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ క్రమంగా వైభవం కోల్పోతోంది. తాజాగా ఇద్దరు సీనియర్ నేతలు బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నారు. ఇక్కడ తమ రాజకీయ భవిష్యత్తు అంధకారంగా కనిపించడంతో ఇక వారు కమలం పార్టీకే జై కొట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. మాజీ మంత్రి ఈ.పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి ఇటీవల ఢిల్లీ వెళ్లి అక్కడి బీజేపీ నేతలతో మంతనాలు సాగించడమే ఇందుకు నిదర్శనం. తాము పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సన్నద్ధంగా ఉన్నామని వీరు స్పష్టం […]

టీటీడీపీ ' ఖేల్ ' ఖతం.... భవితవ్యం శూన్యం !
Follow us

|

Updated on: Jun 02, 2019 | 12:32 PM

తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ క్రమంగా వైభవం కోల్పోతోంది. తాజాగా ఇద్దరు సీనియర్ నేతలు బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నారు. ఇక్కడ తమ రాజకీయ భవిష్యత్తు అంధకారంగా కనిపించడంతో ఇక వారు కమలం పార్టీకే జై కొట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. మాజీ మంత్రి ఈ.పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి ఇటీవల ఢిల్లీ వెళ్లి అక్కడి బీజేపీ నేతలతో మంతనాలు సాగించడమే ఇందుకు నిదర్శనం. తాము పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సన్నద్ధంగా ఉన్నామని వీరు స్పష్టం చేశారు. ఆ మధ్య తెలంగాణాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొదట పెద్దిరెడ్డికి కూకట్ పల్లి నియోజకవర్గం టికెట్ ను ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ చివరిక్షణంలో దాన్ని నందమూరి సుహాసినికి కేటాయించిన సంగతి తెలిసిందే.ఈ మార్పును పెద్దిరెడ్డి జీర్ణించుకోలేకపోయారు. పార్టీలో సీనియర్ నైన తనను కాదని ఒక్కసారిగా రంగంలోకి వఛ్చిన సుహాసినికి ఇవ్వడమేమిటని అయన తన మద్దతుదారుల వద్ద వాపోయారు. అయితే.. లోక్ సభ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో చేరి.. కరీంనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని పెద్దిరెడ్డి భావించినప్పటికీ ఆ తరువాత ఆ యోచనను విరమించుకున్నారు. తెలంగాణాలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయరాదని టీటీడీపీ నిర్ణయించుకుంది. అటు ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎలక్షన్స్ లోనూ తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో తెలంగాణలోని ఈ పార్టీ నాయకుల్లో ఆశలు ఆవిరయ్యాయి. ఇక పార్టీని వీడడమే బెటరని అనుకుంటున్నారు. పైగా ఇక్కడ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ బలం పుంజుకోవడం కూడా వారి ఆశలకు ఊతమిచ్చింది. తాను ఢిల్లీలో కమలనాథులతో భేటీ అయిన మాట వాస్తవమేనని, తన వెంట మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి కూడా ఉన్నారని పెద్దిరెడ్డి అంగీకరించారు. ఇదిలా ఉండగా తను పార్టీ మారే ప్రసక్తి లేదని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ స్పష్టం చేశారు.

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు

గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..