నితీష్ ..బీజేపీకి ఇచ్చారండీ షాక్ !
ప్రధాని మోదీ తన కొత్త మంత్రివర్గంలో తమ (బీహార్) రాష్ట్రం నుంచి ఒకే ఒక్కరికి స్థానం కల్పించడం పట్ల ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘ టిట్ ఫర్ టాట్ ‘ అన్నట్టు ఆయన తమ రాష్ట్ర బీజేపీ శాఖకు షాకిచ్చారు. ఆదివారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో నితీష్ కుమార్.. తమ పార్టీ (జేడీ-యు) సహచరుల్లో 8 మందిని చేర్చుకున్నారు. అయితే బీజేపీకి చెందిన ఒకే ఒక్కరిని కేబినెట్ […]
ప్రధాని మోదీ తన కొత్త మంత్రివర్గంలో తమ (బీహార్) రాష్ట్రం నుంచి ఒకే ఒక్కరికి స్థానం కల్పించడం పట్ల ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘ టిట్ ఫర్ టాట్ ‘ అన్నట్టు ఆయన తమ రాష్ట్ర బీజేపీ శాఖకు షాకిచ్చారు. ఆదివారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో నితీష్ కుమార్.. తమ పార్టీ (జేడీ-యు) సహచరుల్లో 8 మందిని చేర్చుకున్నారు. అయితే బీజేపీకి చెందిన ఒకే ఒక్కరిని కేబినెట్ లోకి తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. మంత్రి పదవికి కమలనాథులు తమ అభ్యర్థిని ఇంకా ఎంపిక చేయాల్సి ఉంది. లోక్ సభ ఎన్నికల్లో మిత్ర పక్షాల పట్ల బీజేపీ అనుసరించిన వైఖరితో నితీష్ అసంతృప్తితో ఉన్న విషయాన్ని కమలనాథులు ప్రయివేటుగా అంగీకరిస్తున్నారు. బీహార్ అభివృద్ది కోసం తాము బీజేపీతో జట్టు కట్టామని, అంతే తప్ప వాటాల కోసం కాదని నితీష్ అంటున్నారు. మోదీ నూతన ప్రభుత్వంలో తమ మిత్ర పక్షాల్లో ఏది.. ఎన్ని సీట్లు గెలిచినప్పటికీ… కేబినెట్ లో ఒక్కొక్క బెర్తును కేటాయించడం ద్వారా ఆయా పార్టీలకు ప్రాతినిధ్యం కల్పిస్తామని కమలనాథులు చేసిన ప్రకటనను నితీష్ అంగీకరించడం లేదు. జేడీ-యు పోటీ చేసిన 17 స్థానాల్లో 16 సీట్లను గెలుచుకుందని ఆయన గుర్తు చేశారు. అయితే బీజేపీ పదిహేడూ సీట్లనూ దక్కించుకోగలిగింది. అంతమాత్రాన తాము ఈ పార్టీ చెప్పినదానికల్లా ‘ ఊ కొడతామని ‘ అనుకోరాదని నితీష్ కుమార్ దాదాపు సవాల్ వంటిది విసిరారు. అటు-ఆయన ప్రకటనతో బీజేపీ నాయకులు డైలమాలో పడ్డారు. తమ పార్టీ అధినాయకత్వం చెబితే.. నితీష్ ఓ మెట్టు దిగవచ్ఛునని రాష్ట్ర కమలనాథులు భావిస్తున్నారు. ఇదే సమయంలో… మోదీ మంత్రివర్గ విస్తరణ చేపట్టినప్పుడు బీహార్ రాష్ట్రానికి ఇతోధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా నితీష్ ఆగ్రహాన్ని కొంతలో కొంతయినా చల్లార్చడానికి యత్నించవచ్చునన్నది కూడా వారి ఆశ. బీహార్ నుంచి రామ్ విలాస్ పాశ్వాన్ కి మోదీ మంత్రివర్గంలో చోటు దక్కిన సంగతి తెల్సిందే.