సేనపై అమిత్ షా ‘ సర్జికల్ స్ట్రైక్ ‘ ఇది !

| Edited By: Srinu

Nov 23, 2019 | 1:33 PM

మహారాష్ట్రలో జరిగిన తాజా పరిణామాలపై స్పందించిన నెటిజన్లు.. ఇది బీజేపీ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్ షా .. శివసేనపై నిర్వహించిన ‘ సర్జికల్ స్ట్రైక్ ‘ అని అభివర్ణించారు. రాష్ట్రంలో అధికార పంపిణీపై 50:50 వాటాను శివసేన కోరిందని, అయితే ఇందుకు బీజేపీ అంగీకరించకపోవడంతో..నిరసనగా ఎన్డీయే ప్రభుత్వం నుంచి వైదొలగిందని వారు గుర్తు చేశారు. దీంతో సేనకు షాక్ ఇచ్చే క్రమంలో.. అమిత్ షా.. ఆ పార్టీమీద ఏకంగా సర్జికల్ దాడికే పూనుకొన్నారని వారన్నారు. ‘ […]

సేనపై అమిత్ షా  సర్జికల్ స్ట్రైక్  ఇది !
Follow us on

మహారాష్ట్రలో జరిగిన తాజా పరిణామాలపై స్పందించిన నెటిజన్లు.. ఇది బీజేపీ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్ షా .. శివసేనపై నిర్వహించిన ‘ సర్జికల్ స్ట్రైక్ ‘ అని అభివర్ణించారు. రాష్ట్రంలో అధికార పంపిణీపై 50:50 వాటాను శివసేన కోరిందని, అయితే ఇందుకు బీజేపీ అంగీకరించకపోవడంతో..నిరసనగా ఎన్డీయే ప్రభుత్వం నుంచి వైదొలగిందని వారు గుర్తు చేశారు. దీంతో సేనకు షాక్ ఇచ్చే క్రమంలో.. అమిత్ షా.. ఆ పార్టీమీద ఏకంగా సర్జికల్ దాడికే పూనుకొన్నారని వారన్నారు. ‘ గతంలో ఇలాగే జరిగింది. దాన్నిమేం ఈ దాడిగా పేర్కొన్నాం.. తమదే పైచేయని భావించిన విపక్షం (సేన) కంటినిండా నిద్ర పోయింది.. కానీ తెల్లవారేసరికి సీనంతా మారిపోయింది ‘ అని ఒక నెటిజనుడు వ్యాఖ్యానించాడు. మరొకరు.. ఇది ఉధ్ధవ్ థాక్రే, సంజయ్ రౌత్, శివసేనలపై జరిపిన సర్జికల్ దాడి అని అభివర్ణించాడు. ఇదిలా ఉండగా.. అజిత్ పవార్ చర్య ఎన్సీపీలోను, పవార్ కుటుంబం లోను చీలిక తెచ్చిందని ఈ పార్టీ నేత సుప్రియా సూలే ఆగ్రహం వ్యక్తం చేశారు అటు- .54 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది అజిత్ పవార్ కు మద్దతునిస్తున్నారన్న విషయాన్ని నిర్ధారించుకునేందుకు ఎన్సీపీ నాయకత్వం .. ‘ వారి తలలు లెక్కించే కార్యక్రమానికి ‘ శ్రీకారం చుడుతోంది.