ఎన్నికల వేళ దీదీకీ ఎదురుదెబ్బ.. బీజేపీలోకి కీలక నేత

వెస్ట్ బెంగాల్ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఎదురుదెబ్బ తగిలింది. టీఎంసీ పార్టీ ముఖ్య నాయకుడు, భత్‌పరా ఎమ్మెల్యే అర్జున్‌ సింగ్‌ కమలం గూటికి చేరారు. బీజేపీ నాయకుడు ముకుల్‌ రాయ్‌తో ఢిల్లీలో భేటీ అయిన అనంతరం సీనియర్‌ నాయకుల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకొన్నారు. ఆయనతో పాటు తృణమూల్‌ బహిష్కృత నేత, బోల్‌పూర్‌ ఎమ్మెల్యే అనుపమ్‌ హజ్రా, సీపీఎం నాయకుడు ఖగేన్‌ మెర్ము కూడా బీజేపీ […]

ఎన్నికల వేళ దీదీకీ ఎదురుదెబ్బ.. బీజేపీలోకి కీలక నేత
Follow us

| Edited By:

Updated on: Mar 14, 2019 | 6:06 PM

వెస్ట్ బెంగాల్ : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఎదురుదెబ్బ తగిలింది. టీఎంసీ పార్టీ ముఖ్య నాయకుడు, భత్‌పరా ఎమ్మెల్యే అర్జున్‌ సింగ్‌ కమలం గూటికి చేరారు. బీజేపీ నాయకుడు ముకుల్‌ రాయ్‌తో ఢిల్లీలో భేటీ అయిన అనంతరం సీనియర్‌ నాయకుల సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకొన్నారు. ఆయనతో పాటు తృణమూల్‌ బహిష్కృత నేత, బోల్‌పూర్‌ ఎమ్మెల్యే అనుపమ్‌ హజ్రా, సీపీఎం నాయకుడు ఖగేన్‌ మెర్ము కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం అర్జున్‌ సింగ్‌ మాట్లాడుతూ… డబ్బులు ఇస్తేనే తృణమూల్‌ కాంగ్రెస్‌లో మనుగడ సాధించవచ్చని పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని విమర్శించారు. ‘ నేను 40 ఏళ్లుగా మమతా జీ దగ్గర పనిచేశాను. కానీ బాలాకోట్‌లో వైమానిక దళం జరిపిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ విషయంలో భారత సైన్యం విశ్వసనీయతను ఆమె ప్రశ్నించడం నన్ను కలచివేసింది. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా దేశమంతా ఒక్కటై మాట్లాడుతుంటే మమతా జీ మాత్రం.. మెరుపు దాడుల వెనుక ప్రధాని నరేంద్ర మోదీ ఉద్దేశం ఏమిటని అడగటం నిజంగా దురదృష్టకరమని అర్జున్ సింగ్ వ్యాఖ్యానించారు.