గిరిజన సంక్షేమశాఖ ఉన్నతాధికారులతో సత్యవతి రాథోడ్ సమీక్ష.. అర్హత కలిగిన అందరికీ ప్రమోషన్‌ లభిస్తుందన్న మంత్రి‌

తెలంగాణలో గురుకులాలు పునః ప్రారంభమైన నేపథ్యంలో గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ, గిరిజ సంక్షేమ శాఖలో పని చేస్తున్న బోధన, బోధనేతర..

గిరిజన సంక్షేమశాఖ ఉన్నతాధికారులతో సత్యవతి రాథోడ్ సమీక్ష.. అర్హత కలిగిన అందరికీ ప్రమోషన్‌ లభిస్తుందన్న మంత్రి‌
Follow us
K Sammaiah

|

Updated on: Feb 04, 2021 | 3:45 PM

తెలంగాణలో గురుకులాలు పునః ప్రారంభమైన నేపథ్యంలో గిరిజన గురుకుల విద్యాలయాల సంస్థ, గిరిజ సంక్షేమ శాఖలో పని చేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది, అధికారులతో రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఉద్యోగుల పదోన్నతి, సదుపాయాల కల్పనపై ఉద్యోగ సంఘాల నేతలు, అధికారులు వారి అభిప్రాయాలు వెల్లడించారు.

సీఎం కేసిఆర్ ఆదేశాలతో పదోన్నతులు, భర్తీపై రాష్ట్రంలో ముందడుగు పడిందని మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. అర్హత కలిగిన అందరికీ పదోన్నతి లభిస్తుందని చెప్పారు. సర్వీస్ రూల్స్ ఇబ్బంది వల్ల సరైన న్యాయం జరగడం లేదనే సమస్యను పరిశీలించి, సీఎం కేసిఆర్ దృష్టికి తీసుకెళతానన్నారు.

గురుకులాలకు పిల్లలు వచ్చారు. వీటిపట్ల తల్లిదండ్రులకు ఉన్న నమ్మకం చాలా గొప్పది. గురుకులాలకు వచ్చే పిల్లల భవిష్యత్ గొప్పగా ఉండాలి. ఇందుకోసం పని చేసే మీ సమస్యలు పరిష్కరించడం కూడా మా బాధ్యత అని ఉద్యోగులను ఉద్దేశించి మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు

గిరిజన ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సమర్థవంతంగా ప్రజలకు చేరవేసి వారికి మేలు చేయడంలో అంకిత భావంతో పని చేయాలని సూచించారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ శ్రీమతి క్రిస్టినా, ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్, అదనపు కార్యదర్శులు సర్వేశ్వర్ రెడ్డి, నవీన్ నికోలస్, ఇతర అధికారులు, నేతలు పాల్గొన్నారు.

Read more:

కొంగుసాపి అడుతున్న సారూ.. మా కొలువులు మాకివ్వండి.. పల్లా రాజేశ్వర్‌రెడ్డి కాళ్లమీద పడి ప్రాదేయపడ్డ మహిళా ఫీల్డ్‌ అసిస్టెంట్‌