AP Corona : రాష్ట్రంలో మళ్లీ పదివేలు దాటిపోయిన కేసులు.. ఏపీలో కరోనా విలయం, పూర్వాపరాలు

| Edited By: Phani CH

Apr 23, 2021 | 3:01 PM

AP Corona : ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కరోనా పరిస్థితి చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ఏపీలో ఫస్ట్ వేవ్ కరోనా ప్రభావం తగ్గిన తర్వాత కోవిడ్ సెంటర్లను మూసేశామని...

AP Corona : రాష్ట్రంలో మళ్లీ పదివేలు దాటిపోయిన కేసులు..  ఏపీలో కరోనా విలయం, పూర్వాపరాలు
Ap Corona
Follow us on

Andhra Pradesh Corona : ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కరోనా పరిస్థితి చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ఏపీలో ఫస్ట్ వేవ్ కరోనా ప్రభావం తగ్గిన తర్వాత కోవిడ్ సెంటర్లను మూసేశామని… ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపుతున్న తరుణంలో మళ్లీ వాటిని ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. అన్ని ఆసుపత్రుల్లో పడకలు, ఔషధాలు సిద్ధం చేయాలని ఆదేశించామని వెల్లడించారు. 21 వేల మంది వైద్య సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ఇలా ఉండగా, రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పదివేలు దాటిపోయాయి. నిన్నటి వరకూ నమోదైన మొత్తం కరోనా కేసులు – 9,97,462 గా నమోదయ్యాయి. మొత్తం కరోనా మృతులు – 7, 541 గా ఉన్నాయి. కాగా, ఏపీలో గత సంవత్సరం జూలై – అక్టోబర్‌ మధ్యలో అత్యధిక కేసులు నమోదు నమోదయ్యాయి. ఇక, ఏపీలో కరోనా విలయం యొక్క ప్రస్తుత పరిస్థితి, పూర్వాపరాలను ఒకసారి పరిశీలిద్దాం..

ఆంధ్రప్రదేశ్‌ లో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది – 15-03-2020
గతంలో రోజువారీ పదివేలకు పైగా కేసులు నమోదైంది – 26-08-2020
గతంలో ఒక్కరోజులో అత్యధికంగా కేసులు నమోదైంది – 01-09-2020న 10,368 కేసులు
తాజాగా నిన్న (22-04-2020) మళ్లీ రోజువారీ కేసులు పదివేలు దాటాయి

ఏపీలో తొలి పాజిటివ్‌ కేసు నమోదైన 2020, మార్చి 15 తర్వాత మూడు నెలలపాటు సాధారణ పరిస్థితి
2020, జూలై నుంచీ కేసుల సంఖ్య పెరుగుదల
2020, అక్టోబరు వరకూ కొనసాగిన ఉధృతి
2020, నవంబరు నుంచి తగ్గుముఖం
2021, ఫిబ్రవరి 15న అత్యల్పంగా 30 పాజిటివ్‌ కేసులు
2021, మార్చి మూడో వారం నుంచీ మళ్లీ కేసుల పెరుగుదల
ఏప్రిల్‌ నుంచీ వేలల్లోకి పాజిటివ్‌ కేసులు

ఏపీలో గత సంవత్సరం నుంచీ కరోనా కేసుల తీవ్రత ఎలా ఉందో పరిశీలిద్దాం…

01-07-2020న కేసులు – 657
01-08-2020న కేసులు – 9,276
01-09-2020న కేసులు – 10,368
01-10-2020న కేసులు – 6,751
01-11-2020న కేసులు – 2,618
01-12-2020న కేసులు – 685
01-01-2021న కేసులు – 338
01-02-2021న కేసులు – 64
01-03-2021న కేసులు – 58
01-04-2021న కేసులు – 1,271

22-04-2021న కేసులు – 10,759

 

మరిన్ని ఇక్కడ చూడండి: తెలంగాణలో కరోనాపై హైకోర్టులో విచారణ.. కేసులు తగ్గాయన్న ప్రభుత్వం.. ఎక్కడ తగ్గాయో చూపించాలని హైకోర్టు ప్రశ్న

YSR Zero Interest Scheme: మహిళా సాధికారత మా నినాదం కాదు.. విధానం.. ‘వైఎస్ఆర్ సున్నా వడ్డీ’ నగదు జమ చేసిన సీఎం జగన్..