గవర్నర్‌ తమిళిసైకి అందిన నియామక పత్రాలు.. పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు‌

|

Feb 17, 2021 | 3:36 PM

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌కు పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు పుదుచ్చేరి స్పెషల్‌..

గవర్నర్‌ తమిళిసైకి అందిన నియామక పత్రాలు.. పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు‌
Follow us on

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌కు పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు పుదుచ్చేరి స్పెషల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ కృష్ణకుమార్‌ సింగ్‌ బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ‌తమిళిసైని కలిసి నియామక పత్రాలను అందజేశారు. మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీని కేంద్ర ప్రభుత్వం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి మంగళవారం తొలగించిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ గవర్నర్‌గా ఉన్న డాక్టర్ తమిళిసైకి అదనపు బాధ్యతగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవిని కూడా అప్పగించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై త్వరలో పుదుచ్చేరి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి కిరణ్ బేడిని తొలగిస్తూ రాష్ట్రపతి భవన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గత కొద్దికాలంగా సీఎం నారాయణస్వామితో కిరణ్‌బేడీకి ఆధిపత్య పోరు నడుస్తోంది. ప్రస్తుతం పుదుచ్చేరి సర్కార్‌ మైనారిటీలో పడిపోయింది. అయితే ఎందుకు కిరణబేడీని ఆకస్మాత్తుగా తొలగిస్తూ రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

అసెంబ్లీ ఎన్నికలకు ముందే పలువురు కాంగ్రెస్ శాసనసభ్యులు రాజీనామా చేసిన తరువాత పుదుచ్చేరి అసెంబ్లీలో పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఎమ్మెల్యే రాజీనామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వి.నారాయణసామి నేతృత్వంలోని మంత్రివర్గం రాజీనామా చేస్తామని పుదుచ్చేరి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కందసామి మంగళవారం అన్నారు. పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్ బేడీ నాలుగేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేధిస్తున్నారని.. కాంగ్రెస్ పాలనను రద్దు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. సిఎం నారాయణసామి నేతృత్వంలోని మంత్రివర్గాన్ని రద్దు చేసి, అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కందస్వామి ఒక వీడియోలో పేర్కొన్నారు.

 

Read more:

తెలంగాణలో విజయవంతమైన ‘కోటి వృక్షార్చన’.. ఇంతకీ సీఎం కేసీఆర్ ఏ మొక్క నాటారో తెలుసా..?