ఢిల్లీలో ఉంది మోడీనా.. కేడీనా.. కేంద్ర వ్యవసాయ చట్టాల గుట్టు విప్పిన సీఎల్పీ నేత భట్టీ
కేంద్రం తెచ్చిన నూతన రైతు చట్టాలపై పోరుబాట పట్టారు కాంగ్రెస్ నేత సీఎల్పీ భట్టి విక్రమార్క. ఆదిలాబాద్ రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని..
కేంద్రం తెచ్చిన నూతన రైతు చట్టాలపై పోరుబాట పట్టారు కాంగ్రెస్ నేత సీఎల్పీ భట్టి విక్రమార్క. ఆదిలాబాద్ రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని చేపట్టిన భట్టి.. దేశం ఎదుర్కుంటున్న సమస్యని ఆదిలాబాద్ నుండి పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నాం అంటూ తెలిపారు.
భవిష్యత్తులో కార్పొరేట్ చేతిలో రైతులను బానిసలుగా మారే చట్టాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొరుబాటుకు సిద్ధంగా ఉన్న ఆదిలాబాద్ రైతుల మాటలు ఆనాటి సాయుధ పోరాటాన్ని గుర్తు చేస్తున్నాయని తెలిపారు.రైతులను కాపాడుకునేందుకు, రైతును రాజును చేసేందుకు ఇక్కడికి వచ్చామన్నారు.
ఢిల్లీలో ఉంది మోడీ నో కేడినో త్వరలో తేలుద్దాన్నారు భట్టి. రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తే ఊరుకునేది లేదన్నారు. ఫసల్ భీమా లో రైతు తన వాటా చెల్లించినా రాష్ట ప్రభుత్వ వాటా చెల్లించక పోవడంతో రైతులకు రావాల్సిన 960 కోట్లు రాని పరిస్థితి నెలకొందన్నారు.
Read more:
లోటస్‌పాండ్‌లో అందరి చూపులు ఆ ఫ్లెక్సీల వైపే.. ఇంతకీ ఫ్లెక్సీలపై ఏం రాశారో తెలుసా..?