కొత్త మంత్రులు వీరే.. నో డౌట్..!

కొత్త మంత్రులు వీరే.. నో డౌట్..!

ఎట్టకేలకు రాష్ట్ర కేబినెట్ విస్తరణ చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తాజాగా చేపడుతున్న మంత్రివర్గ విస్తరణలో ఆరుగురు మంత్రులకు చోటు దక్కింది. ఇవాళ సాయంత్రం 4.00 గంటలకు వీరంతా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్‌కు కూడా మంత్రివర్గ విస్తరణ సమాచారాన్ని సీఎం తెలియచేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావులతో పాటుగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, […]

TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Sep 08, 2019 | 7:58 PM

ఎట్టకేలకు రాష్ట్ర కేబినెట్ విస్తరణ చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. తాజాగా చేపడుతున్న మంత్రివర్గ విస్తరణలో ఆరుగురు మంత్రులకు చోటు దక్కింది. ఇవాళ సాయంత్రం 4.00 గంటలకు వీరంతా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా నియమితులైన తమిళిసై సౌందరరాజన్‌కు కూడా మంత్రివర్గ విస్తరణ సమాచారాన్ని సీఎం తెలియచేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావులతో పాటుగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ కుమార్‌లు కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వీరితో పాటుగా మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి, వరంగల్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌‌లు కూడా మహిళా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే వీరందరికీ దాదాపుగా సీఎం ఆఫీస్ నుంచి మంత్రి పదవి చేపట్టాలంటూ ఫోన్లు వచ్చినట్లు తెలుస్తోంది.

మొత్తం కేబినెట్‌లో 18 మందికి అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం 12 మంది మాత్రమే ఉన్నారు. అయితే కేబినెట్ పూర్తిగా ఉండాలంటే మరో ఆరుగురు మంత్రులను నియమించాల్సి ఉంది. అయితే వీరిలో కొత్త మంత్రి పదువులు ఎవరికి దక్కుతాయన్న టెన్షన్కు తెరపడింది. అయితే కొత్త వారిని తీసుకోవడంతో పాటుగా.. మరో ఇద్దరు పాత మంత్రులకు పదవీ గండం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కొద్ది రోజుల నుంచి ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌కి సీఎం కేసీఆర్ మధ్య దూరం పెరిగిందంటూ వార్తలు వెలువడ్డాయి. ఆయన ఇటీవల ఓ కార్యక్రమంలో చేసిన.. “టీఆర్ఎస్ జెండాకు ఓనర్లం మేమే అంటూ” వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా నిలిచాయి. అయితే ఆ తర్వాత కేసీఆరే మా బాస్ అంటూ సరిదిద్దుకున్నారు. అయితే మంత్రి పదవి పోతుందంటూ వచ్చిన పుకార్లతో.. అసహనంతో చేసి ఉంటారని పలువురు అభిప్రాయపడ్డారు. ఈటెలతో పాటుగా మంత్రి మల్లారెడ్డికి కూడా పదవీ గండం ఉందంటూ వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఎలాంటి ఉద్వాసన లేకుండానే కేబినెట్ విస్తరణ జరగనున్నట్లు తెలుస్తోంది.

అయితే ఇక కొత్త మంత్రి వర్గంలో చోటు దక్కించుకోవడం కోసం గట్టి పోటీ నెలకొంది. మంత్రివర్గంలో మహిళ, గిరిజన కోటా ఖాళీగా ఉంది. కేటీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించిన తర్వాత.. ఆయనకు మంత్రిపదవి ఇవ్వాలని కేసీఆర్‌పై ఒత్తిడి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే మిత్రపక్షం మజ్లిస్‌ పార్టీ నుంచి కూడా కేటీఆర్‌కు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ వస్తోంది. ఇటీవల ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ సైతం ఇదే అంశంపై ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌కు మంత్రి పదవి కన్ఫార్మ్ అయ్యింది. మరోవైపు హరీశ్‌రావుకు మంత్రిపదవిపై మొదట్లో కొంత అస్పష్టత ఉన్నా.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆయనకు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు కేటీఆర్‌ కూడా ఇదే భావనతో ఉన్నారని వినికిడి. అయితే మహిళా మంత్రులుగా సత్యవతి రాథోడ్‌తో పాటుగా సబిత రెడ్డి పేరు కూడా సీఎం ఖరారు చేశారని తెలుస్తోంది. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆమెకు మంత్రి పదవి కేటాయించినట్లు తెలుస్తోంది. గిరిజన, మహిళా కోటా కింద సత్యవతి రాథోడ్‌ వైపు కేసీఆర్ మొగ్గుచూపారు. ఖమ్మం జిల్లా నుంచి హరిప్రియ, ఆదిలాబాద్‌ జిల్లా నుంచి రేఖానాయక్‌ల పేర్లను పరిశీలించినా వీరి కంటే సమీకరణాల పరంగా సత్యవతికే మార్కులు పడ్డాయి. ఇక ఖమ్మం జిల్లాలో గత శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌.. ముఖ్యమైన సామాజికవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లాలో వివిధ వర్గాలను ఆయన సమన్వయపరుస్తారని సీఎం భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆయనను కూడా మంత్రి పదవి వరిస్తోంది. వీరంతా ఇవాళ సాయంత్రం రాజ్ భవన్‌లో గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu