మొన్న ఈటల.. నిన్న రసమయి..
గులాబీ దళానికేమయింది? ఒకరు సొంత నేతలనే టార్గెట్ చేస్తే.. మరొకరు ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకున్నారు. మొన్న ఈటల… నిన్న రసమయి.. ఇలా తమ వాక్ స్వాతంత్ర్యాన్ని యధేశ్చగా వాడేస్తున్నారు. దాంతో ఒక్కొక్కరుగా పార్టీ గీత దాటడంపై సీరియస్ గా ఉన్న గులాబీ బాస్ త్వరలోనే నేతలకు పెద్ద క్లాసే తీసుకునేట్టున్నారు. టీఆర్ఎస్ లో ఈటల రేపిన మంటలే.. ఇంకా ఆర లేదు అనుకుంటే ఇప్పడు రసమయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపుతున్నాయి. దాంతో రసమయి […]

గులాబీ దళానికేమయింది? ఒకరు సొంత నేతలనే టార్గెట్ చేస్తే.. మరొకరు ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకున్నారు. మొన్న ఈటల… నిన్న రసమయి.. ఇలా తమ వాక్ స్వాతంత్ర్యాన్ని యధేశ్చగా వాడేస్తున్నారు. దాంతో ఒక్కొక్కరుగా పార్టీ గీత దాటడంపై సీరియస్ గా ఉన్న గులాబీ బాస్ త్వరలోనే నేతలకు పెద్ద క్లాసే తీసుకునేట్టున్నారు.
టీఆర్ఎస్ లో ఈటల రేపిన మంటలే.. ఇంకా ఆర లేదు అనుకుంటే ఇప్పడు రసమయి బాలకిషన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపుతున్నాయి. దాంతో రసమయి కామెంట్స్ పై అధిష్టానం ఆరా తీస్తున్నట్లు సమాచారం. రసమయి ఫ్లో లో అన్నాడా.. లేక ఈటలకు మద్దతు పలుకుతున్నాడా అన్న కోణంలో పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈటలకు మద్దతుగా ఇంకెవరైనా మాట్లాడే అవకాశం ఉందా అని నిఘా కూడా పెట్టినట్లు సమాచారం.
మరోవైపు ఈటలను పిలిపించి సీఎం కేసీఆర్ గాని, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గాని మాట్లాడే ప్రయత్నం చేయలేదు. దాంతో ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందో అని పార్టీలో చర్చ జరుగుతోంది.