AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎన్ని కేసులు పెట్టినా బెదిరేది లేదు..జగన్‌పై చంద్రబాబు ఫైర్

రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్.. జనాలను భయపెట్టి పాలన సాగించాలని చూస్తున్నారని మండిపడ్డారు. సొంత బాబాయి హత్యకు గురైతే.. అందుకు కారకులను పట్టుకోవడం చేతకాని ముఖ్యమంత్రి తెలుగుదేశం కార్యకర్తలపై దాడులను ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంతో పాటు పల్నాడును రక్షించుకోవడానికి ఈనెల 11న చలో ఆత్మకూరు కార్యక్రమం నిర్వహించనున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. టీడీపీ ఒంటరికాదనే విషయాన్ని ఈ […]

ఎన్ని కేసులు పెట్టినా బెదిరేది లేదు..జగన్‌పై చంద్రబాబు ఫైర్
chandrababu slams jagan over attack on tdp activists
Ram Naramaneni
|

Updated on: Sep 08, 2019 | 5:10 PM

Share

రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్.. జనాలను భయపెట్టి పాలన సాగించాలని చూస్తున్నారని మండిపడ్డారు. సొంత బాబాయి హత్యకు గురైతే.. అందుకు కారకులను పట్టుకోవడం చేతకాని ముఖ్యమంత్రి తెలుగుదేశం కార్యకర్తలపై దాడులను ప్రోత్సహిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంతో పాటు పల్నాడును రక్షించుకోవడానికి ఈనెల 11న చలో ఆత్మకూరు కార్యక్రమం నిర్వహించనున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. టీడీపీ ఒంటరికాదనే విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా తెలుపుదామని నేతలకు ఆయన పిలుపునిచ్చారు. పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

వైసీపీ నేతల ఆటలు సాగనివ్వమని.. ఇష్టానుసారం దాడులు చేయడం కేసులు పెట్టడాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. అందరికంటే ముందు తానే నిలుస్తానని.. తనపైన కేసు పెడతారేమో చూద్దామని చంద్రబాబు కార్యకర్తలతో అన్నారు. ఈనెల 10న టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తామని.. పార్టీకి చెందిన న్యాయవాదులంతా హజరవుతారని చెప్పారు. లీగల్​సెల్ ను పటిష్ట పరిచి.. కార్యకర్తలకు అండగా నిలుపుతామన్నారు.