AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కొలిక్క వచ్చిన తెలంగాణ కేబినెట్ విస్తరణ?.. సాయంత్రంలోపు తుది నిర్ణయం వెలువడే ఛాన్స్‌

తెలంగాణ కేబినెట్ విస్తరణనకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. సోమవారం సాయంత్రంలోపు కేబినెట్‌ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై తుది నిర్ణయం వెలువడనుంది.గత మూడు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఈ అంశాలపై కాంగ్రెస్ హైకమాండ్‌తో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. కాగా ఇవాళ మధ్యాహ్నం మరోసారి అధిష్టానంతో భేటీ అయ్యి కేబినెట్‌ విస్తరణపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Telangana: కొలిక్క వచ్చిన తెలంగాణ కేబినెట్ విస్తరణ?.. సాయంత్రంలోపు తుది నిర్ణయం వెలువడే ఛాన్స్‌
Telangana Congress
Anand T
|

Updated on: May 26, 2025 | 11:14 AM

Share

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కావొస్తున్న ఇప్పటికీ ఇంకా కేబినెట్‌ విస్తరణ చేయలేదు. దీంతో పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం కేబినెట్‌లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా.. వాటి కోసం పోటీ కూడా గట్టిగానే ఉంది.ఈ క్రమంలో తాజాగా కేబినెట్‌ కూర్పుపై కాంగ్రెస్ హైకమాండ్‌ దృష్టి సారిచింది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్య నేతలను ఢిల్లీకి రావాలని పిలుపునిచ్చింది. ఇక హైకమాండ్‌ పిలుపుతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ పీసీసీ చీఫ్‌ మహేష్ కుమార్ గౌడ్, తదితర తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ వెళ్లారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ నిన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చలు జరిపారు. అయితే ఈ చర్చల్లో మంత్రివర్గ విస్తరణపై చర్చలు కొలిక్కి రాగా.. పిసిసి కార్యవర్గ కూర్పు పై మాత్రం ఇంకా స్పష్టత రానట్టు తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యేల నుంచి వచ్చిన వినతులను సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లగా వాటిని పరిశీలించిన అధిష్టానం సామాజికవర్గం, జిల్లాల వారీగా పేర్లను ఎంపిక చేసినట్టు సమాచారం. అయితే ఈ జాబితాను ఇవాళ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనాయకులు ఖర్గే, రాహల్, కేసి వేణుగోపాల్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ సమావేశం తర్వాత మంత్రివర్గంలోని పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

అయితే, కేబినెట్‌ విస్తరణ కొలిక్కి వచ్చినా పిసిసి కార్యవర్గంపై మాత్రం ఇంకా చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. పీసీసీ కార్యవర్గ కూర్పలో సామాజిక సమీకరణాలకు కాంగ్రెస్ పెద్దపీట వేనున్నట్టు తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సుమారు 70 శాతం అవకాశం కల్పించనున్న కాంగ్రెస్ వర్గాలు చర్చ జరుగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..