కేసీఆర్ కొత్త టీంతో బడ్జెట్: కీలక అంశాలు ఇవే..!

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను 2019-2002కి సంబంధించి.. అసెంబ్లీలో.. సీఎం కేసీఆర్, మండలిలో హరీశ్ రావు ప్రవేశపెట్టబోతున్నారు. మొత్తం ఈ బడ్జెట్‌ను 1.65 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్‌కు రాష్ర్ట కేబినెట్ నిన్ననే ఆమోదం తెలిపింది. కాగా.. ఈ రోజు 11.30 గంటలకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కీ పాయింట్స్: గత అసెంబ్లీలో పాస్ చేసిన కొత్త మున్సిపల్ బిల్ ఆర్డినెన్స్‌ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్న మంత్రి కేటీఆర్ తెలంగాణ బెవెరేజెస్ మూడో […]

కేసీఆర్ కొత్త టీంతో బడ్జెట్: కీలక అంశాలు ఇవే..!
Follow us

| Edited By:

Updated on: Sep 09, 2019 | 8:20 AM

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ను 2019-2002కి సంబంధించి.. అసెంబ్లీలో.. సీఎం కేసీఆర్, మండలిలో హరీశ్ రావు ప్రవేశపెట్టబోతున్నారు. మొత్తం ఈ బడ్జెట్‌ను 1.65 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్‌కు రాష్ర్ట కేబినెట్ నిన్ననే ఆమోదం తెలిపింది. కాగా.. ఈ రోజు 11.30 గంటలకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

కీ పాయింట్స్:

  • గత అసెంబ్లీలో పాస్ చేసిన కొత్త మున్సిపల్ బిల్ ఆర్డినెన్స్‌ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్న మంత్రి కేటీఆర్
  • తెలంగాణ బెవెరేజెస్ మూడో ఆర్థిక సంవత్సరం రిపోర్ట్‌ను సభలో ప్రవేశపెట్టనున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
  • ఫిబ్రవరిలో 1,82,017 (లక్షా 82 వేల 17)కోట్ల ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ప్రభుత్వం
  • ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ (మిగిలిన ఆరునెలలకు) బడ్జెట్ కేటాయింపు
  • కేంద్రం నుంచీ దాదాపు రూ.1000 కోట్లు తగ్గబోతున్నట్లు సమాచారం
  • ఓన్లీ నీటి పారుదల, వ్యవసాయం, సంక్షేమ రంగాలకు మాత్రమే పూర్తిస్థాయి నిధులు కేటాయింపు.
  • ఇప్పుడు తెలంగాణలో.. ఆర్థిక మాంద్యం దృష్ట్యా ఆచితూచి.. బడ్జెట్ కేటాయించిన కేసీఆర్
  • పలు రకాల అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులు తగ్గింపు

సభ అనంతరం బీఏసీ సమావేశం.. అసెంబ్లీ పనిదినాలు, షెడ్యూల్ పై చర్చ. కాగా.. బడ్జెట్‌పై అసెంబ్లీలో వారం రోజుల పాటు చర్చ జరిగే అవకాశం. కనీసం 23 రోజులు సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయగా.. రాష్ట్రంలోని అన్ని రకాల సమస్యలపై చర్చించేదాకా.. సభ నడవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.