AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొన్న ఈటెల.. నేడు నాయిని.. అసలేం జరుగుతోంది..?

మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ మాట తప్పారని.. అసెంబ్లీ ఎన్నికల ముందు ముషీరాబాద్ నుంచి పోటీ చేస్తానంటే.. టికెట్ ఇవ్వలేదని అన్నారు. ముషీరాబాద్‌లో ముఠా గోపాల్‌ను గెలుపించుకుని రమ్మన్నారని.. ముఠా గోపాల్‌ను గెలిపిస్తే.. మంత్రి పదవి ఇస్తానన్నారన్నారు. అంతేకాదు తన అల్లుడికి ఎమ్మెల్సీ పదవి కూడా ఇస్తానని చెప్పి ఇప్పుడు మాట తప్పారన్నారు. నాయినికి ఆర్టీసీ చైర్మన్ పదవిని ఇస్తారంటున్న వ్యాఖ్యలపై స్పందించారు. నేను […]

మొన్న ఈటెల.. నేడు నాయిని.. అసలేం జరుగుతోంది..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 09, 2019 | 3:05 PM

Share

మాజీ మంత్రి, టీఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నర్సింహా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ మాట తప్పారని.. అసెంబ్లీ ఎన్నికల ముందు ముషీరాబాద్ నుంచి పోటీ చేస్తానంటే.. టికెట్ ఇవ్వలేదని అన్నారు. ముషీరాబాద్‌లో ముఠా గోపాల్‌ను గెలుపించుకుని రమ్మన్నారని.. ముఠా గోపాల్‌ను గెలిపిస్తే.. మంత్రి పదవి ఇస్తానన్నారన్నారు. అంతేకాదు తన అల్లుడికి ఎమ్మెల్సీ పదవి కూడా ఇస్తానని చెప్పి ఇప్పుడు మాట తప్పారన్నారు. నాయినికి ఆర్టీసీ చైర్మన్ పదవిని ఇస్తారంటున్న వ్యాఖ్యలపై స్పందించారు. నేను హోంమంత్రిగా చేశానని.. ఆ చైర్మన్ పదవి ఎవరికి కావాలంటూ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్‌లో నేను కూడా ఓనర్‌నే అని అన్న ఆయన.. కిరాయికి వచ్చినవాళ్లు ఎప్పుడు దిగిపోతారో తెలియదని వ్యాఖ్యానించారు. అయితే ఇటీవల మంత్రి ఈటెల రాజేందర్, రసమయి కూడా పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే మంత్రి పదవి అలానే ఉండటం.. హరీశ్ రావుకు కూడా మంత్రి పదవి రావడంతో పార్టీలో అనిశ్చితి తొలగిపోయిందనుకున్న తరుణంలో ఇప్పుడు నాయిని చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

Follow Us
ఒకప్పుడు మాల్స్‌లో పని చేసింది.. కట్ చేస్తే ఇప్పుడు
ఒకప్పుడు మాల్స్‌లో పని చేసింది.. కట్ చేస్తే ఇప్పుడు
విద్యార్ధుల వీపులు పగిలేలా కొట్టిన హెడ్ మాస్టర్.. ఆ తర్వాత సీన్‌
విద్యార్ధుల వీపులు పగిలేలా కొట్టిన హెడ్ మాస్టర్.. ఆ తర్వాత సీన్‌
6 ఇన్నింగ్స్..4 సార్లు డకౌట్..అయినా సరే అభిషేకే కావాలంటున్న కోచ్
6 ఇన్నింగ్స్..4 సార్లు డకౌట్..అయినా సరే అభిషేకే కావాలంటున్న కోచ్
చిల్లీ చికెన్ ముద్దలా అవుతోందా?.. ఇవి కలిపితే యమా టేస్టీ..
చిల్లీ చికెన్ ముద్దలా అవుతోందా?.. ఇవి కలిపితే యమా టేస్టీ..
నెలకు రూ.1000 కడితే చాలు 1 కోటి రూపాయలు.. అప్పుల బాధే ఉండదు..!
నెలకు రూ.1000 కడితే చాలు 1 కోటి రూపాయలు.. అప్పుల బాధే ఉండదు..!
ఆమె ఏపీకి వచ్చి ప్రియుడ్ని కలిసి ఒక్కసారిగా స్టన్ అయింది...
ఆమె ఏపీకి వచ్చి ప్రియుడ్ని కలిసి ఒక్కసారిగా స్టన్ అయింది...
తెలుగు రాష్ట్రాల్లో గురువారం వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్
తెలుగు రాష్ట్రాల్లో గురువారం వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్
గుమ్మం దగ్గర ఇవి ఉంటే.. నెగిటివ్ ఎనర్జీకి రెడ్ కార్పెట్ వేసినట్టే
గుమ్మం దగ్గర ఇవి ఉంటే.. నెగిటివ్ ఎనర్జీకి రెడ్ కార్పెట్ వేసినట్టే
శివరాత్రి పండక్కి చికెన్ కూర వండలేదనీ.. భర్త సూసైడ్! ఎక్కడంటే..
శివరాత్రి పండక్కి చికెన్ కూర వండలేదనీ.. భర్త సూసైడ్! ఎక్కడంటే..
రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స!
రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స!