చికెన్ Vs  మటన్.. ఆరోగ్యానికి ఏది మంచిదంటే?

Samatha

18 February 2026

నాన్ వెజ్ ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది ఎంతో నాన్ వెజ్ తింటారు. ఇక కొందరు చికెన్ ఇష్టపడి మరికొంత మంది మటన్ ఇష్టపడుతుంటారు.

నాన్ వెజ్

చికెన్, మటన్ రెండింటితో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అయినా కానీ చాలా మందిలో ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది అనే కన్ఫ్యూషన్ ఉంటుంది.

చికెన్, మటన్

కాగా, ఇప్పుడు మనం ప్రముఖ పోషకాహార నిపుణురాలు పూజా మల్హోత్రా , చికెన్, మటన్ గురించిన ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. దాని గురించి తెలుసుకుందాం.

నిపుణుల సలహ

చాలా మంది మటన్‌లో కొవ్వు శాతం అధికంగా ఉంటుందని దానికి దూరంగా ఉంటారు. కానీ ఇది ఏ మాత్రం నిజం కాదని చెప్పుకొచ్చారు.

మటన్

మటన్‌లో ఐరన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువలన రక్తహీనత సమస్యతో బాధపడే వారు మటన్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.

ఐరన్

ఇక కొంత మంది మటన్ తినడం వలన బరువు పెరుగుతాం అనుకుంటారు. కానీ మటన్ తినడం వలన బరువు నియంత్రణలోనే ఉంటుంది కానీ, కండరాలు బలపడ్తాయట.

బరువు నియంత్రణ

చికెన్‌లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే మటన్ తింటే కొవ్వు అధికంగా ఉంటుంది అనుకునే వారికి చికెన్ బెస్ట్ ఎంపిక.

ప్రోటీన్ 

 అందువలన వారి వారి ఎంపికపై ఇది ఆధారపడి ఉంటుంది. అయితే చాలా మందికి చేపలు మొదటి ఎంపిక అవుతే, చికెన్, మటన్ రెండో స్థానంలో ఉంటున్నాయంట.

చేపలే మొదటి ఎంపిక