AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిజెపికి బాబు బిస్కట్లు.. మరి అమిత్‌షా దిగొచ్చేనా?

బిజెపికి దగ్గరయ్యేందుకు చంద్రబాబు తెగ తాపత్రయపడుతున్నారా? పరిస్థితులు, పరిణామాలు, టిడిపి నేతల సందర్శనలు చూస్తుంటే నిజమేనన్న అనుమానం కలుగుతోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఉప్పు, నిప్పులా మారి.. మోదీపై ఆల్‌మోస్ట్ యుద్దాన్ని ప్రకటించిన టిడిపి అధినేత చంద్రబాబునాయుడు.. తాజాగా బిజెపితో జతకట్టేందుకు ఉవ్విళ్ళూరుతున్నట్లు కనిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం చంద్రబాబు చేసిన వ్యాఖ్యతో ఆయన బిజెపి పంచన మరోసారి చేరేందుకు సిద్దమవుతున్నారన్న సంకేతాలు వ్యక్తమయ్యాయి. ఈ మేరకు మీడియాలో కథనాలొచ్చినా.. చంద్రబాబు గానీ, టిడిపి నేతలు గానీ […]

బిజెపికి బాబు బిస్కట్లు.. మరి అమిత్‌షా దిగొచ్చేనా?
Rajesh Sharma
| Edited By: |

Updated on: Nov 29, 2019 | 5:32 PM

Share

బిజెపికి దగ్గరయ్యేందుకు చంద్రబాబు తెగ తాపత్రయపడుతున్నారా? పరిస్థితులు, పరిణామాలు, టిడిపి నేతల సందర్శనలు చూస్తుంటే నిజమేనన్న అనుమానం కలుగుతోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఉప్పు, నిప్పులా మారి.. మోదీపై ఆల్‌మోస్ట్ యుద్దాన్ని ప్రకటించిన టిడిపి అధినేత చంద్రబాబునాయుడు.. తాజాగా బిజెపితో జతకట్టేందుకు ఉవ్విళ్ళూరుతున్నట్లు కనిపిస్తోంది.

కొన్ని రోజుల క్రితం చంద్రబాబు చేసిన వ్యాఖ్యతో ఆయన బిజెపి పంచన మరోసారి చేరేందుకు సిద్దమవుతున్నారన్న సంకేతాలు వ్యక్తమయ్యాయి. ఈ మేరకు మీడియాలో కథనాలొచ్చినా.. చంద్రబాబు గానీ, టిడిపి నేతలు గానీ ఖండించలేదు. పైగా బిజెపి నేతలు చంద్రబాబును తమ దరికి రానిచ్చేది లేదని ఖరాఖండీగా ప్రకటనలు చేశారు. రాష్ట్ర నాయకులతోపాటు జాతీయ స్థాయి నేతలు కూడా చంద్రబాబుకు శాశ్వతంగా బిజెపి డోర్లు మూసుకుపోయాయని వ్యాఖ్యానించారు.

కానీ చంద్రబాబు ప్రయత్నాలు ఆపలేదని తాజా పరిణామాలు చాటుతున్నాయి. అమరావతిని రాష్ట్ర రాజధాని కేంద్రంగా గుర్తించకపోవడం కొన్ని రోజుల క్రితం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ఆ తర్వాత విడుదలైన మ్యాపుల్లోను అమరావతిని ఏపీ రాజధానిగా ప్రస్తావించలేదు. దీంతో వైఫల్యం గత టిడిపి పాలకులదా లేక కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ఉద్దేశ పూర్వక నిర్లక్ష్యమా అన్న చర్చ జోరుగా సాగింది.

అయితే.. తాజాగా విడుదల చేసిన దేశ చిత్రపటంలో అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తించారు. దీనికి కృతఙ్ఞతలు చెప్పే సాకుతో టిడిపి నేతలు.. కమలం నేతలతో భేటీ అవుతున్నారు. తాజాగా ఢిల్లీలో పార్లమెంటు సమావేశాల కోసం వున్న టిడిపి ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు తదితరులు కేంద్ర హోం శాఖా మంత్రి, బిజెపి అధినేత అమిత్‌షాను కలిసారు. బుధవారం అమిత్‌షాతో భేటీ అయిన టిడిపి నేతలు రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను ఆయనకు వివరించామని మీడియాకు తెలిపారు. నిజానికి అమరావతిని గుర్తించినందుకు కలిస్తే రాజకీయ పరిణామాలపై చర్చించాల్సిన అవసరం అంతగా లేదు. అది కూడా ఆరు నెలల క్రితం తాము దుమ్మెత్తిపోసిన నేతతోనే రాజకీయ పరిణామాలను చర్చించడంలో ఔచిత్యం పెద్దగా వుండదు.

కానీ టిడిపి ఎంపీలు రాష్ట్ర రాజకీయ పరిణామాలను అమిత్‌షాతో చర్చించడం.. ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే ఇందులో చంద్రబాబు వ్యూహం కూడా గోచరిస్తుంది. చంద్రబాబు వ్యూహం ప్రకారమే తిరిగి బిజెపికి దగ్గరయ్యేందుకు స్కెచ్ వేశారని పలువురు భావిస్తున్నారు. ఒకవైపు వైసీపీ, ఇంకోవైపు బిజెపి.. రెండింటి మధ్య టిడిపి కనుమరుగైతే పరిస్థితి దారుణంగా వుంటుందన్న ఫీలింగ్‌తోనే చంద్రబాబు కొత్త వ్యూహానికి తెరలేపారని పరిశీలకులు భావిస్తున్నారు.