ఆ కూటమివన్నీ బేరసారాలే ! నిప్పులు కక్కిన అమిత్ షా

మహారాష్ట్రలోని తాజా పరిణామాలపై మొదటిసారిగా స్పందించిన బీజేపీ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్ షా.. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిపై నిప్పులు కక్కారు. ఆ కూటమి జరిపింది బేరసారాలు కావా అని తన ట్విట్టర్లో ప్రశ్నించారు. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు పరస్పర విరుధ్ధ సిధ్ధాంతాలు గల పార్టీలు ఏకమయ్యాయని ఆయన అన్నారు. శివసేన ప్రజలకు ద్రోహం చేసిందని, ఆ పార్టీయే వారిని అవమానించింది గానీ తమ బీజేపీ కాదని అన్నారు. దాదాపు వంద సీట్లు గల రెండు పార్టీల […]

ఆ కూటమివన్నీ బేరసారాలే ! నిప్పులు కక్కిన అమిత్ షా
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 27, 2019 | 8:17 PM

మహారాష్ట్రలోని తాజా పరిణామాలపై మొదటిసారిగా స్పందించిన బీజేపీ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్ షా.. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిపై నిప్పులు కక్కారు. ఆ కూటమి జరిపింది బేరసారాలు కావా అని తన ట్విట్టర్లో ప్రశ్నించారు. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు పరస్పర విరుధ్ధ సిధ్ధాంతాలు గల పార్టీలు ఏకమయ్యాయని ఆయన అన్నారు. శివసేన ప్రజలకు ద్రోహం చేసిందని, ఆ పార్టీయే వారిని అవమానించింది గానీ తమ బీజేపీ కాదని అన్నారు. దాదాపు వంద సీట్లు గల రెండు పార్టీల కూటమి 56 సీట్లు గెలుచుకున్న సేన పార్టీకి ముఖ్యమంత్రి పదవిని ఇవ్వజూపడం ముమ్మాటికీ బేరసారాలే అని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యేల శిబిరాలు పెట్టిన పార్టీలు ఎన్నికల ముందు కుదుర్చుకున్న పొత్తుకు బ్రేకప్ చెప్పి తమను (బీజేపీని) విమర్శిస్తున్నాయని అన్నారు. (ఎన్నికలముందు మహారాష్ట్రలో శివసేన-బీజేపీ పొత్తు కుదుర్చుకున్న సంగతి విదితమే).’ ఆ మూడు పార్టీలూ విలువలకు తిలోదకాలిచ్ఛేశాయి.. నిజానికి మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీసే అవుతారని మేం ఉధ్దవ్ థాక్రే, ఆదిత్య థాక్రే లు పాల్గొన్న ప్రతి కార్యక్రమం లోనూ, సభా వేదికలపైనా చెబుతూ వచ్చాం.. పైగా రొటేషన్ పదవి విషయమై శివసేనకు ఏనాడూ మేము హామీని ఇవ్వలేదు ‘ అని అమిత్ షా స్పష్టం చేశారు . మాది కక్ష సాధింపు చర్య కాదు

గాంధీల కుటుంబానికి ఎస్పీజీ భద్రతను ఉపసంహరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని అమిత్ షా సమర్థించుకున్నారు. ఈ విషయమై బుధవారం పార్లమెంటులో మాట్లాడిన ఆయన.. కక్ష సాధింపు అన్నది బీజేపీ సంస్కృతిలోనే లేదని, అది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అని విమర్శించారు. దేశ అత్యున్నత నేతలకు కల్పించే ఎస్పీజీ భద్రతకు సంబంధించిన నిబంధనలను కేవలం ఒక కుటుంబం కోసం గత ప్రభుత్వాలు నీరు గార్చాయని ఆయన ఆరోపించారు. నేను ఎవరి పేర్లనూ ప్రస్తావించదలచుకోలేదు.. ఢిల్లీలో ఒకరు సెక్యూరిటీని పట్టించుకోకుండా వంద కిలోమీటర్ల వేగంతో నడుస్తుంటే భద్రతా దళాలు వెనుకబడిపోతున్నాయని ఆయన పరోక్షంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నిజానికి గాంధీల కుటుంబానికి భద్రతను రద్దు చేయలేదని, కేవలం ‘ రీప్లేస్ ; చేశామని ఆయన పేర్కొన్నారు. రాజకీయ కారణాలతోనే సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు ఎస్పీజీ భద్రతను తొలగించారని అంతకుముందు సభలో కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు.