Casting Vote: తాండూరులో దొంగ ఓటు రచ్చ.. చైర్పర్సన్ రాజీనామాకు ప్రతిపక్షాల పట్టు..!

|

Mar 22, 2021 | 6:57 PM

Tatikonda Swapna: ఆమె మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌. కెబినెట్‌ హోదా. ఐతేనేమి.. ఓ దొంగ పని చేశారు. అదీ ఇదీ కాదు.. ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా దొంగ ఓటు వేశారు. అది ఎక్కడంటే..

Casting Vote: తాండూరులో దొంగ ఓటు రచ్చ.. చైర్పర్సన్ రాజీనామాకు ప్రతిపక్షాల పట్టు..!
Tatikonda Swapna
Follow us on

ఆమె మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌. కెబినెట్‌ హోదా. ఐతేనేమి.. ఓ దొంగ పని చేశారు. అదీ ఇదీ కాదు.. ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా దొంగ ఓటు వేశారు. అది ఎక్కడంటే.. ఈ మధ్య జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేశారు దొంగ ఓటు. వినడానికి షాక్‌ అనిపించినా.. ఇది షాక్‌ ఇచ్చే నిజం. ఆమె తాండూరు మున్సిపాలిటీ చైర్‌పర్సన్. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి.. అడ్డదారిలో ఓటు వేశారు తాటికొండ స్వప్న. ఇదే ఇప్పుడు తాండూరులో హాట్‌ హాట్‌గా మారుతోంది.

ఈ విషయం బయటకు పొక్కడంతో రాజకీయ దుమారం మొదలయింది. చైర్‌పర్సన్‌ పదవికి రాజీనామా చెయ్యాలని డిమాండ్‌ చేస్తూ.. కాంగ్రెస్‌, సీపీఐ, తెలంగాణ జన సమితి కౌన్సిలర్లు మున్సిపల్‌ ఆఫీస్‌ ముందు ధర్నాకు దిగారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న పేరిట ఓటు లేకున్నా.. ఆమె తోటి కోడలు పై నమోదైన ఓటును వేశారు.

దీనిపై జిల్లా కలెక్టర్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వరకూ విపక్షాలు ఫిర్యాదు చేశాయి. ఈ ఘటనపై స్పందించిన ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టారు. ఈ విచారణలో చైర్ పర్సన్ వేసింది దొంగ ఓటే నని తేలింది. దీంతో దొంగ ఓటు ఈ విషయంలో ఒక తాటి పైకి వచ్చిన ప్రతిపక్షాలు చైర్పర్సన్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు.

ఓ పక్క బల్దియా కార్యాలయం ముందు కాలనీ సమస్యలు చైర్పర్సన్ పట్టించుకోవడంలేదని నిరసిస్తూ బీజేపీ కౌన్సిలర్ ఆందోళనకు దిగారు. దీనికి పోటీగా చైర్ పర్సన్ రాజీనామా చేయాలని మిగతా విపక్షాలు కూడా ఆందోళనకు దిగడంతో బల్దియా కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చైర్ పర్సన్ వ్యవహారం తాండూరులో రసవత్తరంగా మారిందని చెప్పాలి.

ఇవి కూడా చదవండి: AADHAR CARD: పింఛన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ‘జీవన్ ప్రమాణ్’ కోసం ఆధార్ తప్పనిసరి కాదన్న కేంద్రం

Malaika Arora Is The Hottest: బోల్డ్ ఫోటోలతో కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తున్న మలైకా అరోరా.. లైక్ చేసిన ప్రియుడు అర్జున్ కపూర్

ఈ పనిని 10 రోజుల్లో చేయండి..! లేకపోతే మీ పాన్ కార్డు పనికిరాదు..! 10 వేల వరకు ఫైన్ కూడా పడే ఛాన్స్..!