కాంగ్రెస్‌లో కొత్త బ్లడ్ ఎక్కించాలని అధినేత్రి సోనియాగాంధీ డిసైడ్ అయ్యారా? ఆ దిశగా అడుగులు వేస్తున్నారా? ఐకమత్యమే మహాబలం అని నేతలకు ఎందుకు క్లాస్ తీసుకుంటున్నారు? హస్తంలో రిపేర్లు మొదలయ్యాయా? సిట్యువేషన్ చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పార్టీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన అధినేత్రి సోనియాగాంధీ.. నేతలకు సంకేతాలు, సూచనలు, చురకలతో పాటు క్లాస్ తీసుకున్నారు. ఇదంతా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్‌లో భాగమేనన్న ప్రచారం మాత్రం జోరందుకుంటోంది.
కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని మరోసారి స్పష్టం చేశారు ఏఐసీసీ అధ్యక్షురాల సోనియాగాంధీ. పార్టీలో నేతలు గొడవపడడంపై తీవ్రంగా స్పందించారు సోనియా. అందరూ క్రమశిక్షణతో ఉండాలని హెచ్చరించారు. వ్యక్తిగత లక్ష్యాలు, స్వార్ధ ప్రయోజనాలను దూరం పెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ దుష్ట చర్యలపై బాధితుల తరఫున పోరాటాన్ని ముమ్మరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వేర్వేరు రాష్ట్రాల్లోని నేతల మధ్య సహకారం కొరవడిందని, వాళ్ల మధ్య వాళ్లకే స్పష్టత లేదని అసహనం వ్యక్తం చేశారు సోనియా.
క్షేత్రస్థాయిలో ప్రధాన సమస్యలపై పోరాటంలో నేతలకు క్లారిటీ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ మెరుగైన స్థానంలో ఉన్నప్పుడే నేతలు మంచి పొజిషన్‌లో ఉంటారన్న విషయాన్ని మరచిపోవద్దన్నారు సోనియా. నిజానికి ఉన్నతస్థాయి సమావేశం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఉద్దేశించిందే.
కానీ పార్టీకి యువరక్తం ఎక్కించాల్సిన అవసరం ఉందనే సంకేతాలు సోనియా ఇచ్చినట్టు తెలుస్తోంది. అప్పుడే పార్టీ ముందుకెళ్తుందని.. లీడర్లంతా అప్‌డేట్ కావాల్సిందేనని స్పష్టం చేసినట్టు సమాచారం. అయితే ఈ ప్రక్షాళన వెనుక ప్రశాంత్ కిషోర్ సలహాలు, సూచనలు ఉన్నాయనే ప్రచారం కూడా నడుస్తోంది. ఫైనల్‌గా ఐకమత్యం లేకుండా ఏదీ సాధ్యం కాదనే నిజాన్ని నేతలకు స్పష్టం చేశారు సోనియా.
ఇవి కూడా చదవండి: India Post – HDFC: పోస్టాఫీస్ కస్టమర్లకు అద్భుత అవకాశం.. ఇకపై గృహ రుణాలు కూడా అందిస్తోంది.. పూర్తివివరాలివే..
Dramatic Video: ఎవరో వస్తారని.. ఎదో చేస్తారని ఎదురుచూడలేదు.. ప్రాణాలు పణంగా పెట్టి..