వారికే దిక్కు లేదు కానీ.. ఒకరికి ఒకరు ఆఫర్లు..

ఏపీలో టీడీపీ, బీజేపీ పార్టీలు మా పార్టీలోకి వస్తే పదవులు ఇస్తామంటూ ఎమ్మెల్సీలు బుద్ధా వెంకన్న, సోము వీర్రాజులు ఒకరికొకరు ఆఫర్లు ఇచ్చుకుంటున్నారు. ఏపీలో టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆషాఢం తర్వాత ఆ నెంబర్ మారొచ్చని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏపీలో బీజేపీకి ఎమ్మెల్యేలు జీరో.. ఎంపీలు జీరో. ఇలాంటి పరిస్థితుల్లో బుద్దా వెంకన్న, సోము వీర్రాజులు వాళ్ళ పార్టీ పరిస్థితిని మర్చిపోయి.. లాబీల్లో మాట్లాడుకునే మాటలు రాజకీయ వర్గాలకి జోకులుగా మారాయి. బుద్దాను […]

వారికే దిక్కు లేదు కానీ.. ఒకరికి ఒకరు ఆఫర్లు..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 29, 2019 | 8:59 AM

ఏపీలో టీడీపీ, బీజేపీ పార్టీలు మా పార్టీలోకి వస్తే పదవులు ఇస్తామంటూ ఎమ్మెల్సీలు బుద్ధా వెంకన్న, సోము వీర్రాజులు ఒకరికొకరు ఆఫర్లు ఇచ్చుకుంటున్నారు. ఏపీలో టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆషాఢం తర్వాత ఆ నెంబర్ మారొచ్చని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏపీలో బీజేపీకి ఎమ్మెల్యేలు జీరో.. ఎంపీలు జీరో. ఇలాంటి పరిస్థితుల్లో బుద్దా వెంకన్న, సోము వీర్రాజులు వాళ్ళ పార్టీ పరిస్థితిని మర్చిపోయి.. లాబీల్లో మాట్లాడుకునే మాటలు రాజకీయ వర్గాలకి జోకులుగా మారాయి. బుద్దాను చూసి సోము వీర్రాజు 2024లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. కనుక నువ్వు కాషాయం కండువా వేసుకో.. మంత్రి పదవి ఇస్తాం అంటూ ఆఫర్ చేశారు. అందుకు బుద్దా.. మీరే మాతో కలిసి పోటీ చెయ్యండి.. పవర్లోకి రాగానే కేబినెట్లోకి తీసుకుంటామని బదులిచ్చారట. వీళ్లు ఇద్దరు తమ తమ పార్టీల్లో పెద్ద శక్తిమంతులు కాకపోయినా వీళ్ళ సంభాషణ అందరినీ ఆకర్షించింది. ఆషాఢం తర్వాత టీడీపీ నుంచి బీజేపీలోకి భారీ వలసలు ఉంటాయని కమలనాధులు బల్లగుద్ది చెబుతుండటంతో.. బీజేపీకి టచ్ లో ఉన్నవారిపై టీడీపీ నిఘా పెట్టింది. ప్రస్తుతం ఈ రెండు పార్టీల మధ్య ఉన్న కోల్డ్ వార్ భవిష్యత్తులో సీరియస్ వార్ కావడం ఖాయమనే సంకేతాలు సూచిస్తున్నాయి.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే