మూడు పార్టీలకు నెత్తినొప్పి.. ఇంతకీ వివేకాను చంపిందెవరు?

దాదాపు తొమ్మిది నెలల క్రితం జరిగిన ఓ మర్డర్ ఏపీలో మూడు ప్రధాన పార్టీలకు నెత్తినొప్పి తెచ్చిపెడుతోంది. మర్డర్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌కు ఏ క్లూ దొరక్కపోవడంతో మూడు పార్టీల నేతలను గ్రిల్ చేస్తోంది. దాంతో ఎటు తిరిగి తమ మెడకు ఈ మర్డర్ కేసు చుట్టుకుంటుందో అన్న ఆందోళన మూడు ప్రధాన పార్టీలను ముంచెత్తుతోంది. గత మార్చి నెల మూడో వారంలో కడప మాజీ ఎంపీ, మాజీ మంత్రి, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు […]

మూడు పార్టీలకు నెత్తినొప్పి.. ఇంతకీ వివేకాను చంపిందెవరు?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 11, 2019 | 4:57 PM

దాదాపు తొమ్మిది నెలల క్రితం జరిగిన ఓ మర్డర్ ఏపీలో మూడు ప్రధాన పార్టీలకు నెత్తినొప్పి తెచ్చిపెడుతోంది. మర్డర్ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్‌కు ఏ క్లూ దొరక్కపోవడంతో మూడు పార్టీల నేతలను గ్రిల్ చేస్తోంది. దాంతో ఎటు తిరిగి తమ మెడకు ఈ మర్డర్ కేసు చుట్టుకుంటుందో అన్న ఆందోళన మూడు ప్రధాన పార్టీలను ముంచెత్తుతోంది.

గత మార్చి నెల మూడో వారంలో కడప మాజీ ఎంపీ, మాజీ మంత్రి, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కు పినతండ్రి అయిన వైఎస్ వివేకానంద రెడ్డి పులివెందులలోని తన సొంతింట్లో దారుణ హత్యకు గురయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ మర్డర్ జరగడంతో అంతా ఉలిక్కిపడ్డారు. ముఖ్యంగా ప్రతిపక్షంలో వున్న వైసీపీకి చెందిన నేత కావడంతో వివేకా హత్య కేసు అధికార పార్టీకి ఎక్కడ నష్టం కలిగిస్తుందో అని అప్పట్లో అధికారపార్టీ కంగారు పడింది.

హత్య జరిగిన రాత్రే ఆల్‌మోస్ట్ ఆధారాలన్నీ తుడిచేసిన పరిస్థితిలో కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులకు ఏ క్లూ దొరక్కపోవడంతో గత 9 నెలలుగా కేసు దర్యాప్తు ఓ కొలిక్కి రావడం లేదు. దాంతో అనుమానాలు వ్యక్తమయిన ప్రతీ ఒక్కరిని విచారణకు పిలుస్తోంది సిట్. ఈ నేపథ్యంలోనే కేసు దర్యాప్తులో పడుతున్న ఒక్కో అడుగు మూడు ప్రధాన పార్టీలు వైసీపీ, టిడిపి, బిజెపిలకు టెన్షన్ పుట్టిస్తోంది.

తొలుత ఈ కేసులో తెలుగుదేశంపార్టీలో వున్న బి.టెక్ రవిని అనుమానించారు. ఆయన్ని సిట్ అధికారులు విచారణకు పిలిచారు. ఆయన విచారణ పూర్తి అయిన వెంటనే కడప సిట్టింగ్ ఎంపీ, వైసీపీ నేత, వైఎస్ వివేకా అన్న కొడుకు అయిన వైఎస్ అవినాశ్ రెడ్డిని విచారణకు పిలిచింది సిట్. ఆ తర్వాత నజర్ మాజీ మంత్రి, ప్రస్తుతం బిజెపిలో కొనసాగుతున్న ఆదినారాయణ రెడ్డిపై పడింది. తాజాగా ఆయన్ను విచారణకు పిలిస్తే రావడం లేదన్న కథనాలు వినిపించాయి. దాంతో ఆయనపై అనుమానాలు మరింతగా బలపడ్డాయి.

ఈ క్రమంలో వెలుగులోకి వచ్చిన ఆదినారాయణ రెడ్డి.. వివేకా హత్యకేసులో తన ప్రమేయం వుందని నిరూపిస్తే బహిరంగంగా ఉరేసుకుంటానని ఛాలెంజ్ చేశారు. దాంతో వివేకా హత్యకేసు మరో మలుపు తిరిగినట్లయ్యింది.

మొత్తమ్మీద ఎవరి ప్రమేయంతో వివేకా హత్య జరిగిందో కానీ.. ఎటు తిరిగి ఎవరికి చుట్టుకుంటుందో, తద్వారా తమ పార్టీ ఎక్కడ ఇరకాటంలో పడుతుందోనని టిడిపి, కాంగ్రెస్, బిజెపిల రాష్ట్ర నాయకత్వాలు మధనపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.