Telangana Politics: తెలంగాణలో నయా రాజకీయ ముఖచిత్రం.. రేవంత్ వర్సెస్ షర్మిల.. ముదురుతున్న వార్
తెలంగాణ లో షర్మిళ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయక ముందే .. పొలిటికల్ హీట్ రాజుకుంది. షర్మిళ పార్టీ పై అధికార టిఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి నామ మాత్రపు స్పందన మాత్రమే వచ్చింది.
తెలంగాణ లో షర్మిళ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయక ముందే .. పొలిటికల్ హీట్ రాజుకుంది. షర్మిళ పార్టీ పై అధికార టిఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి నామ మాత్రపు స్పందన మాత్రమే వచ్చింది. ఒక్క కాంగ్రెస్ నుంచే ఎక్కువ రియాక్షన్ కనిపిస్తోంది. కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలో భాగంగానే రాష్ట్రంలో షర్మిళ పార్టీ ఎంట్రీ జరుగుతోందని కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. రేవంత్ కామెంట్స్ పై షర్మిళ సన్నిహితుల నుంచింపెడ్డ ఎత్తున రియాక్షన్ వచ్చింది. రేవంత్ పైనా .. కాంగ్రెస్ పైన షర్మిళ వర్గీయులు విమర్శలు ఎక్కుపెట్టారు.
షర్మిళ వర్గీయుల నుంచి వస్తున్న విమర్శల పై రేవంత్ వర్గం కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. తెలంగాణ ప్రజలు షర్మిలను నమ్మరని చెబుతున్న కాంగ్రెస్ నేతలు .. సీమాంధ్ర పెట్టు బడుల కోసం కొంత మంది షర్మిలను కలుస్తున్నారని విమర్శిస్తున్నారు. సీమాంధ్ర నేతలు విసిరే చిల్లర కోసం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతే సహించేది లేదన్నారు. కొత్తగా పార్టీ పెట్టాలనుకుంటున్న షర్మిళ .. ప్రజల్లో హైప్ క్రేయేట్ చేసుకునేందుకు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారని చెబుతున్నారు. కొండ రాఘవ రెడ్డి భేషరతుగా రేవంత్ రెడ్డి కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న రేవంత్ వర్గీయులు లేకపోతే రేవంత్ అభిమానులుగా ఈ విమర్శలపై ఊరుకోరుమని హెచ్చరిస్తున్నారు.
ఇక షర్మిళ రాజకీయ పార్టీ ఏర్పాటుపై గోనె ప్రకాశరావు సైతం తనదైన శైలిలో విశ్లేషణ చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో కలహాల కారణంగా షర్మిళ పార్టీ పెట్టాలని చూస్తోందని గోనె చెబుతున్నారు. ఆస్తి తగాదాలు కారణంగా .. జగన్ పై కోపంతో తెలంగాణ లో పార్టీ పెట్టి .. ఇక్కడ అమాయకులను బలి చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. పార్టీ పెట్టీ చిరంజీవి, దాసరి నారాయణరావు లాంటి వారు ఏమైయ్యారో తెలుసుకోవాలని గోనె షర్మిలకు హితవు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే .. రేవంత్ రెడ్డి సైన్యం నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని షర్మిళ సన్నిహితులు డీజీపికి పిర్యాదు చేస్తున్నారు. మొత్తం మీద షర్మిళ .. రేవంత్ రెడ్డి వర్గీయుల మాటల యుద్ధం తెలంగాణ పాలిటిక్స్ లో హీట్ రాజేస్తోంది.
Also Read:
ఒకటి కాదు.. రెండు కాదు కుప్పలు తెప్పలుగా పాములు… కన్నంలో నుంచి బుసలు కొడుతూ వచ్చాయి.. చివరకు
యజమాని మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న శునకం.. ఇంట్లో ఏడుస్తూ..ఫోటో కేసి చూస్తూ..