మహిళా సంరక్షణ కార్యదర్శులకు ప్రశంసా పత్రాలు.. పంచాయతీ ఎన్నికల స్ఫూర్తితో మున్సిపల్‌ ఎన్నికల్లో పని చేయాలన్న డీఎస్పీ

మహిళా సంరక్షణ కార్యదర్శులకు ప్రశంసా పత్రాలు.. పంచాయతీ ఎన్నికల స్ఫూర్తితో మున్సిపల్‌ ఎన్నికల్లో పని చేయాలన్న డీఎస్పీ

గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ఎనలేని సేవలందించిన మహిళా సంరక్షణా కార్యదర్శు లందరికీ కృతజ్ఞతలని బందరు డిఎస్పి రమేష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మచిలీపట్నంలో సచివాలయాలలో విధులు నిర్వహిస్తున్న..

K Sammaiah

|

Mar 03, 2021 | 3:28 PM

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో పోలింగ్‌ రోజున ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుంగా పోలీసులు పటిష్ట చర్యలు ప్రారంభించారు. గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ఎనలేని సేవలందించిన మహిళా సంరక్షణా కార్యదర్శు లందరికీ కృతజ్ఞతలని బందరు డిఎస్పి రమేష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మచిలీపట్నంలో సచివాలయాలలో విధులు నిర్వహిస్తున్న 50 మంది మహిళా సంరక్షణ కార్యదర్శులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు 2021 విధుల్లో పోలీసులకు సహాయకారులుగా మహిళా సంరక్షణ కార్యదర్శులు ఎనలేని సేవలందించారని, అదే స్ఫూర్తితో రాబోవు మున్సిపల్ ఎన్నికల్లో సమర్థవంతంగా సేవలు అందించాలని డిఎస్పి రమేష్ రెడ్డి అన్నారు.

మచిలీపట్నం లోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన, ప్రశంసా పత్రాలు అందజేత కార్యక్రమానికి, బందరు డిఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మచిలీపట్నంలో సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న 50 మంది మహిళా సంరక్షణ కార్యదర్శులకు, ఎస్పీ శ్రీ రవీంద్రనాథ్ బాబు IPS స్వయంగా సంతకం చేసి తయారుచేసిన ప్రశంసాపత్రాలను వారికి అందజేశారు

ఈ సందర్భంగా డిఎస్పీ రమేష్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, మీరు చేసిన సేవలను గుర్తించి, ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేయడం గర్వించదగ్గ విషయమన్నారు. రాబోవు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, మీరు పనిచేసే వార్డుల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్న సమస్యలను పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. మీ అందరూ సమిష్టి కృషితో, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు కృషి చేయాలన్నారు.

మీ ప్రాంతంలో, సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ పై అధికారులకు తెలియజేయాలని డీఎస్పీ సూచించారు. డీఎస్పీ ఆఫీస్ నందు ఎలక్షన్స్ సెల్ ఏర్పాటు చేశామని చెప్పారు. మీ ప్రాంతంలో వోటర్లను ప్రలోభాలకు గురి చేసే అక్రమ మద్యం, నగదు, విలువైన వస్తువులు పంపిణీకి పాల్పడితే వెంటనే తెలియపరచాలన్నారు. ఇప్పటికే పట్టణంలో ఐదు MCC వాహనాలు ఏర్పాటు చేశామని డీఎస్పీ చెప్పారు. పట్టణంలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన ఎడల, వెంటనే మీరు మీ పోలీస్ స్టేషన్ పోలీసు అధికారికి తెలియపరచాలని కోరారు.

మందుబాబుల ఆగడాలు, మద్యం సరఫరా, ఓటర్లను ఇబ్బంది పెట్టినా, అట్టి సమాచారం వెంటనే పోలీసు అధికారులకు తెలియపరచాలని డీఎస్పీ తెలిపారు. ప్రస్తుతం పట్టణం లోని అన్ని వార్డుల్లో ఎన్యుమరేషన్ ప్రక్రియ జరుగుతుంది. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో ఉన్న గృహాలలో ఎవరెవరు ఉంటున్నది, వారి ఆధార్ కార్డులు పరిశీలించి, వారికి నోటీసులు అందజేయడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో మీరు కూడా పాల్గొనాలని మహిళలకు సూచించారు. ఎన్యుమరేషన్ కార్యక్రమంలో భాగంగా పోలీసు వారితో కలసి నోటీసులు అందజేసి, మీరు మాత్రమే ఇంటిలో ఉండాలి, ఇతరులకు చోటు ఇచ్చిన ఎడల పోలీసు వారు చర్యలు తీసుకుంటారు అనే విషయాలు వారికి తెలియపరచాలని అన్నారు.

మీ వార్డుల్లో మీరు సమర్థవంతంగా విధులు నిర్వహించే సమయమిది. ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేలా ప్రతి ఒక్కరు విధులు నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, చిలకలపూడి సిఐ అంకబాబు గారు, రాబర్ట్సన్ పేట పోలీస్ స్టేషన్ CI భీమరాజు గారు , ఇనగుదురు CI శ్రీనివాస్ గారు, మచిలీపట్నం, చిలకలపూడి,ఇనగుదురు, ఆర్ పేట ఎస్ఐలు, సిబ్బంది, మహిళా పోలీసులు పాల్గొన్నారు

Read More:

అలా అయితే టీడీపీని మూసేస్తాం.. లేదంటే వైసీపీ దుకాణం కట్టేస్తారా..? కాక రేపుతున్న టీడీపీ.. వైసీపీ సవాళ్లు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu