పంజాబ్ లో తొమ్మిది జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ మరో రెండు గంటల పొడిగింపు., సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్
పంజాబ్ లో రాత్రి కర్ఫ్యూ వేళలను తొమ్మిది జిల్లాల్లో మరో రెండు గంటలు పొడిగించారు. ఇప్పటివరకు ఈ కర్ఫ్యూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటలవరకు ఉండగా ఇప్పుడిది రాత్రి 9 గంటలనుంచే ప్రారంభమవుతుందని సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ ప్రకటించారు.
పంజాబ్ లో రాత్రి కర్ఫ్యూ వేళలను తొమ్మిది జిల్లాల్లో మరో రెండు గంటలు పొడిగించారు. ఇప్పటివరకు ఈ కర్ఫ్యూ రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటలవరకు ఉండగా ఇప్పుడిది రాత్రి 9 గంటలనుంచే ప్రారంభమవుతుందని సీఎం కెప్టెన్ అమరేందర్ సింగ్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో కరోనా వైరస్ కేసులు రోజూ దాదాపు 100 కి పైగా వరకునమోదవుతున్నాయని ఆయన చెప్పారు. లూథియానా, జలంధర్, పాటియాలా, మొహాలీ, అమృత్ సర్, గురుదాస్ పూర్, హోషియార్ పూర్, కపుర్తలా, రోపర్ జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ వేళలను మరో 2 గంటలు పొడిగించినట్టు ఆయన చెప్పారు. బుధవారం ఒక్క రోజే పంజాబ్ లో కొత్తగా 2 వేలకుపైగా కరోనా వైరస్ కేసులు నమోదు కాగా 35 మంది కరోనా రోగులు మృతి చెందారు.అంతకుముందు మంగళవారం రోజు యాక్టివ్ కేసులు 12,616 నుంచి 13, 320 కి పెరిగాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు తగ్గని పక్షంలో రానున్న రోజుల్లో మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని, ఆంక్షలు విధిస్తామని అమరేందర్ సింగ్ చెప్పారు. ఇక్కడ కరోనా వైరస్ పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
కరోనా వైరస్ ని అదుపు చేయడంలో పంజాబీలంతా తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని ఆయన కోరారు. తమకు ఏ మాత్రం స్వల్ప అస్వస్థత లక్షణాలు ఉన్నా వారు వెంటనే డాక్టర్లను సంప్రదించాలని ఆయన కోరారు. పంజాబ్ నించి హిమాచల్ ప్రదేశ్ కు వచ్చే యాత్రికులపై ఆంక్షలు విధించే యోచన ఉందన్న ఆ రాష్ట్ర సీఎం వ్యాఖ్యలపై మీ స్పందన ఏమిటన్న ప్రశ్నకు అయన.. అయితే ఆ రాష్ట్రం నుంచి వచ్చే యాత్రికులపై తాము ఏ విధమైన ఆంక్షలనూ విధించబోమన్నారు, మన రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉంటే సరిపోతుందన్నారు. ఏమైనా కోవిడ్ అదుపునకు మా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది.. ప్రజలంతా ఇందుకు సహకరిస్తామని మేం ఆశిస్తున్నాం అని అమరేందర్ సింగ్ చెప్పారు.
మరిన్ని ఇక్కడ చదవండి: ఆంధ్రప్రద్‌లో కొత్తగా కొలువుదీరిన మేయర్, మునిసిపల్ ఛైర్మన్లు వీరే..
దేశంలో ఇక టోల్ ప్లాజాలు ఉండవ్, ఇకపై జీపీఎస్ ఆధారిత కలెక్షన్ సెంటర్లే, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ