Kakinada: కూల్ సిటీ కాకినాడలో కాక రేపుతున్న రాజకీయాలు.. తదుపరి మేయర్ ఎవరంటే..?

|

Sep 17, 2021 | 9:41 AM

కూల్ సిటీ కాకినాడలో రాజకీయాలు కాక రేపుతున్నాయి. మేయర్ పావనికి వ్యతిరేకంగా పొలిటికల్ గేమ్ మొదలైంది. మేయర్ పీఠం దక్కించుకునేందుకు ప్రత్యర్ధులు పావులు కదిపారు.

Kakinada: కూల్ సిటీ కాకినాడలో కాక రేపుతున్న రాజకీయాలు.. తదుపరి మేయర్ ఎవరంటే..?
Kakinada Mayor
Follow us on

కూల్ సిటీ కాకినాడలో రాజకీయాలు కాక రేపుతున్నాయి. మేయర్ పావనికి వ్యతిరేకంగా పొలిటికల్ గేమ్ మొదలైంది. మేయర్ పీఠం దక్కించుకునేందుకు ప్రత్యర్ధులు పావులు కదిపారు. మేయర్ పావనిపై కార్పొరేటర్లందరూ అసంతృప్తితో ఉన్నారని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అంటున్నారు. మేయర్ సొంత పార్టీ.. టీడీపీ కార్పొరేటర్లు కూడా ఆమెకు వ్యతిరేకంగా ఉన్నారని అన్నారు. పార్టీలకతీతంగా కార్పొరేటర్లంతా ఏకమై… మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టారంటున్నారు ఎమ్మెల్యే ద్వారంపూడి

ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి అవినీతిని అడ్డుకున్నందుకే తనపై కుట్ర చేశారని మేయర్ పావని ఆరోపిస్తున్నారు. టీడీపీ కార్పొరేటర్లను బెదిరించి లాక్కున్నారని అన్నారు. దీనికి ప్రతిఫలంగా రాబోయే రోజుల్లో ద్వారంపూడికి గుణపాఠం చెబుతామంటున్నారు మేయర్ పావని. మేయర్ పావని ఆరోపణలకు ద్వారంపూడి కౌంటరిచ్చారు. తాను అవినీతికి పాల్పడినట్లు రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామాచేస్తానంటూ సవాలు విసిరారు. పావని పొజీషన్‌లో తాను ఉండుంటే ఈపాటికే మేయర్ పదవికి రాజీనామా చేసేవాడినన్నారు ద్వారంపూడి.

మొత్తం 50 డివిజన్లు ఉన్న కాకినాడ కార్పొరేషన్‌లో టీడీపీ నుంచి 33మంది, వైసీపీ నుంచి 10మంది, బీజేపీ నుంచి ముగ్గురు, ఇద్దరు ఇండిపెండెంట్లు గెలిచారు. అయితే, పలువురు కార్పొరేటర్లు వైసీపీ గూటికి చేరడంతో ఆ పార్టీ బలంగా 34కి చేరింది. పావనిపై అవిశ్వాస తీర్మానంతో కొత్త మేయర్ ఎవరనేది ఉత్కంఠగా మారింది. అయితే, 40వ డివిజన్ కార్పొరేటర్ శివప్రసన్నను మేయర్ పదవి వరించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

Also Read: హన్మకొండలోని సిద్దేశ్వరాలయంలో అద్భుతం.. సూర్యకిరణాలు తాకిన అనంతరం

సినిమాలను తలదన్నే ఛేజింగ్ సీన్‌.. దొంగను పట్టుకునేందుకు పోలీస్‌ పరుగులు