రెడ్ రోడ్లో యోగా మహాసంగమం.. ప్రధాని మోదీ నేతృత్వంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం
భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలకు కోల్‌కతా ముస్తాబైంది. జూన్ 21న పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని చారిత్రాత్మక రెడ్ రోడ్లో జరిగే ప్రధాన కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహించనున్నారు. "యోగా ఫర్ హెల్తీ ఏజింగ్" అనే థీమ్‌తో ఈ ఏడాది వేడుకలు నిర్వహిస్తున్నారు. యోగా ద్వారా శారీరక, మానసిక, భావోద్వేగ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ఉంది.

భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలకు కోల్‌కతా ముస్తాబైంది. జూన్ 21న పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని చారిత్రాత్మక రెడ్ రోడ్లో జరిగే ప్రధాన కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహించనున్నారు. “యోగా ఫర్ హెల్తీ ఏజింగ్” అనే థీమ్‌తో ఈ ఏడాది వేడుకలు నిర్వహిస్తున్నారు. యోగా ద్వారా శారీరక, మానసిక, భావోద్వేగ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ఉంది.
జూన్ 21, ఆదివారం ఉదయం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో వేలాది మంది యోగా సాధకులు ప్రత్యక్షంగా పాల్గొననుండగా, దేశ విదేశాల నుంచి లక్షలాది మంది వర్చువల్‌గా పాల్గొనే అవకాశం ఉంది. కామన్ యోగా ప్రోటోకాల్ ఆధారంగా నిర్వహించే ఈ సామూహిక యోగా కార్యక్రమంలో ప్రధాని మోదీ స్వయంగా పాల్గొని దేశ ప్రజలకు మార్గనిర్దేశనం చేయనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా సంగమ్ పోర్టల్‌కు అపూర్వ స్పందన లభించింది. ఇప్పటికే 6 లక్షలకు పైగా సంస్థలు ఇందులో నమోదు కావడం విశేషం. యోగాను ప్రజా ఉద్యమంగా మార్చే దిశగా ఇది ఒక కీలక మైలురాయిగా అధికారులు పేర్కొంటున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో యోగా దినోత్సవానికి విశేష ఆదరణ లభిస్తోంది. ఇండియా కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ సమన్వయంతో ప్రపంచవ్యాప్తంగా 210కి పైగా భారతీయ మిషన్లు, దాదాపు 2,500 ప్రదేశాల్లో యోగా కార్యక్రమాలను నిర్వహించనున్నాయి. దీంతో భారతీయ యోగా సంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇక దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఢిల్లీలోని ఎర్రకోట, హరిద్వార్, కోణార్క్ సూర్య దేవాలయం, హంపి, మహాబలిపురం, హైదరాబాద్ సహా 100 చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాల్లో యోగా కార్యక్రమాలు జరగనున్నాయి. భారతీయ సంస్కృతి, వారసత్వం, యోగా సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ కార్యక్రమాలను రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం, యోగాను కేవలం వ్యాయామంగా కాకుండా జీవనశైలిగా స్వీకరించాలనే సందేశాన్ని మరోసారి బలంగా వినిపించనుంది.
వీడియో ఇక్కడ చూడండి..
KOLKATA READY FOR YOGA DAY 2026 🧘🇮🇳
Preparations are in full swing at Red Road as Kolkata gears up to host the International Yoga Day 2026 celebrations. Prime Minister Narendra Modi is set to attend the mega event tomorrow.
Source: ANI#InternationalYogaDay #YogaDay2026… pic.twitter.com/qOTlkEgIO7
— Bengal Leap (@BengalLeap) June 20, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
