జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన పవన్

జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన పవన్

ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతుండగా.. రాజకీయ పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఆయా పార్టీలకు చెందిన కీలక నేతలు ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటూ.. ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను వరుసగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తూ… ఆయనను యాక్టర్ గానే కాకుండా టీడీపీకి భాగస్వామిగానూ అభివర్ణిస్తున్నారని తెలిసిందే. గతంలో పవన్ ను పెద్దగా పట్టించుకోని జగన్… ఎన్నికలు సమీపిస్తుండటం… టీడీపీ – జనసేనల మధ్య పొత్తు […]

Ravi Kiran

|

Mar 28, 2019 | 1:54 PM

ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతుండగా.. రాజకీయ పార్టీల ప్రచారం ఊపందుకుంది. ఆయా పార్టీలకు చెందిన కీలక నేతలు ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటూ.. ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను వరుసగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తూ… ఆయనను యాక్టర్ గానే కాకుండా టీడీపీకి భాగస్వామిగానూ అభివర్ణిస్తున్నారని తెలిసిందే. గతంలో పవన్ ను పెద్దగా పట్టించుకోని జగన్… ఎన్నికలు సమీపిస్తుండటం… టీడీపీ – జనసేనల మధ్య పొత్తు సూచనలు స్పష్టంగా కనిపిస్తున్న తరుణంలో చంద్రబాబుతో పాటు పవన్ ను కూడా టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక జగన్ వ్యాఖ్యలపై నిన్నటిదాకా పెద్దగా స్పందించని పవన్… ఇటీవల వాటి పై స్పందించారు. తాజాగా ఆయన ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా మార్కాపురంలో ప్రసంగిస్తూ.. తనపై చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ…. ‘నన్ను యాక్టర్ అంటూ… టీడీపీ భాగస్వామిని అంటూ జగన్ పదే పదే ఆరోపిస్తున్నారు. మరి రెండేళ్ల పాటు జైల్లో ఉండి వచ్చిన జగన్ ను నేను ఏమనాలి?  బీజేపీ… మోదీ… అమిత్ షా… టీఆర్ ఎస్ కు జగన్ దోస్త్ అనాలా? జగన్ చెబుతున్నట్లు ‘అవును నేను యాక్టర్ నే… ఇక నేనేమీ సడన్ గా రాజకీయాల్లోకి రాలేదు. ప్రజల సమస్యలపై అధ్యయనం చేశాకే వచ్చాను. 2009 నుంచి 2019 దాకా మూడు ఎన్నికలను ఎదుర్కొన్నాను. చదివింది పదో తరగతే అయినా… సమాజాన్ని బాగానే స్టడీ చేశా. ఆ తర్వాతే రాజకీయాల్లోకి వచ్చా అంటూ పవన్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu