ఒడిశా సీఎం కీలక నిర్ణయం.. మహిళలకు 33 శాతం సీట్లు

లోక్‌సభ ఎన్నికల వేళ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేడీ తరపున పోటీ చేసే మహిళలకు 33 శాతం సీట్లు ఇస్తామని ప్రకటించారు. కేంద్రాపరాలో నిర్వహించిన మహిళా స్వయం సహాయ బ‌ృంద సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ … రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశా నుంచి పార్లమెంట్‌కు 33 శాతం మంది మహిళలు వెళ్లనున్నట్లు తెలిపారు. భారతదేశంలో మహిళలు సాధికరత సాధించే దిశగా ఒడిశాలోని మహిళలు […]

ఒడిశా సీఎం కీలక నిర్ణయం.. మహిళలకు 33 శాతం సీట్లు
Follow us

| Edited By:

Updated on: Mar 10, 2019 | 5:35 PM

లోక్‌సభ ఎన్నికల వేళ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేడీ తరపున పోటీ చేసే మహిళలకు 33 శాతం సీట్లు ఇస్తామని ప్రకటించారు. కేంద్రాపరాలో నిర్వహించిన మహిళా స్వయం సహాయ బ‌ృంద సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ … రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఒడిశా నుంచి పార్లమెంట్‌కు 33 శాతం మంది మహిళలు వెళ్లనున్నట్లు తెలిపారు. భారతదేశంలో మహిళలు సాధికరత సాధించే దిశగా ఒడిశాలోని మహిళలు నాయకత్వం వహిస్తారన్నారు నవీన్ పట్నాయక్. ప్రపంచానికి భారత్ నాయకత్వం వహించాలన్నా, అమెరికా, చైనా దేశాల్లా అత్యాధునిక దేశం కావాలన్నా మహిళా సాధికారతే మార్గమన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల పై విమర్శలు గుప్పించారు. మహిళా సాధికారత అంటూ వ్యాఖ్యాలు చేస్తున్న జాతీయ పార్టీలు కూడా తమ మాటపై నిలబడాలన్నారు. కాగా మహిళలకు లోక్‌సభ, శాసనసభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చేలా మద్దతు తెలుపుతూ గత ఏడాది నవంబరులో ఒడిశా అసెంబ్లీలో నవీన్ పట్నాయక్ ప్రతిపాదన తీర్మానాన్ని ఆమోదింప చేశారు. దీనికి బీజేపీ, కాంగ్రెస్‌ కూడా మద్దతు తెలిపాయి.

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..