పోస్టు ఊడక ముందే ప్రమోషన్.. వావ్ ఉత్తమ్ !

ఏడాది కాలంగా వరుస ఓటములతో అధ్యక్ష పదవి ఊడడం ఖాయమని అనుకుంటున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉన్న పదవి ఊడక ముందే కొత్త పదవి దక్కి ప్రమోషన్ బాట పడుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి.. మళ్ళీ లోక్‌సభ బరిలో నిలిచి అక్కడా గెలిచి.. చివరికి ఎమ్మెల్యేగిరికి రాజీనామా చేసి, ఎంపీగా కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్త వ్యూహాల అమలును వేగవంతం చేసినట్లు సమాచారం. 2015 నుంచి నాలుగేళ్ళుగా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా కొనసాగుతున్న […]

పోస్టు ఊడక ముందే ప్రమోషన్.. వావ్ ఉత్తమ్ !
Rajesh Sharma

|

Dec 17, 2019 | 2:47 PM

ఏడాది కాలంగా వరుస ఓటములతో అధ్యక్ష పదవి ఊడడం ఖాయమని అనుకుంటున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉన్న పదవి ఊడక ముందే కొత్త పదవి దక్కి ప్రమోషన్ బాట పడుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి.. మళ్ళీ లోక్‌సభ బరిలో నిలిచి అక్కడా గెలిచి.. చివరికి ఎమ్మెల్యేగిరికి రాజీనామా చేసి, ఎంపీగా కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్త వ్యూహాల అమలును వేగవంతం చేసినట్లు సమాచారం.

2015 నుంచి నాలుగేళ్ళుగా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా కొనసాగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి, 2019 పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ ఓటమి, 2019 హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో సతీమణి పద్మావతి ఓటమి.. ఇలా పీసీసీ అధ్యక్షునిగా చేదు ఫలితాలే దక్కాయి. దాంతో టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్ కుమార్‌ని తప్పించడం కన్‌ఫర్మ్ అనుకున్నారంతా. అందుకు డిసెంబర్ నెలే ముహూర్తమని కూడా చాలా మంది రాశారు.

ఇపుడు డిసెంబర్ నెల మూడో వారం నడుస్తోంది. ఇంతవరకు ఉత్తమ్ కుమార్‌ని తప్పిస్తున్నట్లుగా వార్తలేమీ కన్‌ఫర్మ్ కాలేదు. అదే సమయంలో ఉత్తమ్ గురించి మరోవార్త వెలుగులోకి వచ్చింది. ఇటీవల కాలంలో ఎంపీగా ఢిల్లీలోనే ఎక్కువగా వుంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.. అక్కడ తన ప్రమోషన్ వర్క్ బాగా చేసుకుంటున్నారట. తన ప్రయత్నాలు కూడా దాదాపు సక్సెస్ బాటలోనే వున్నాయట. దాంతో టీపీసీసీ పదవి వూడక ముందే.. మరో ప్రమోషన్ ఆయనకు దక్కే ఛాన్స్ వుందట.

రాహుల్ గాంధీ త్వరలో మరోసారి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టబోతున్న తరుణంలో ఏఐసీసీ కమిటీలను పునర్వ్యవస్థీకరించనున్నారు. అందులో భాగంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి త్వరలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి దక్కుతుందని ఆయన అనుచరవర్గం చెప్పుకుంటోంది. అదే జరిగితే అది ఉత్తమ్‌కు ప్రమోషన్‌గానే భావించాలి. సో.. టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడం కాకుండా.. ఆయనకు ప్రమోషన్ ఇచ్చి ఢిల్లీకి పిలిపించుకున్నట్లు అవుతుంది.

సో.. పోస్టు ఊడడం కాదు.. ప్రమోషన్ రానుండడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్సాహంగా కాంగ్రెస్ పెద్దలతో కలుస్తున్నారని, ఢిల్లీ పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారని చెప్పుకుంటున్నారు. దీనికి ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో జరిగిన భారత్ బచావో ర్యాలీనే ఉదాహరణ అంటున్నారు ఆయన అనుచరులు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu