ఇది రాక్షస రాజ్యం..ఏపీ ప్రభుత్వంపై లోకేశ్ ఫైర్

|

Sep 13, 2019 | 2:37 AM

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని 20వ వార్డులో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ చిలికి చిలికి గాలివానగా మారింది. ఈ తగువులో జోక్యం చేసుకున్నందుకు లారీ డ్రైవర్ సలీమ్​పై మరో వ్యక్తి చాకుతో దాడిచేశాడు. అది అతడి వీపులో దిగబడింది. బాధితుడిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు. వైసీపీ కార్యకర్తే… టీడీపీకు చెందిన సలీమ్​పై దాడి చేసినట్లు మాజీ […]

ఇది రాక్షస రాజ్యం..ఏపీ ప్రభుత్వంపై లోకేశ్ ఫైర్
Nara Lokesh Slams CM Jagan
Follow us on

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని 20వ వార్డులో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ చిలికి చిలికి గాలివానగా మారింది. ఈ తగువులో జోక్యం చేసుకున్నందుకు లారీ డ్రైవర్ సలీమ్​పై మరో వ్యక్తి చాకుతో దాడిచేశాడు. అది అతడి వీపులో దిగబడింది. బాధితుడిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు. వైసీపీ కార్యకర్తే… టీడీపీకు చెందిన సలీమ్​పై దాడి చేసినట్లు మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ ఆరోపించారు. క్షతగాత్రుణ్ని పరామర్శించిన ఆయన.. మెరుగైన వైద్యం కోసం సలీమ్​ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

జగ్గయ్యపేట ఘటనను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ ఖండించారు. రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తోందా అని ప్రశ్నించారు. ఇంకెంతమంది నెత్తురు చిందించాలని నిలదీశారు. ప్రభుత్వ పాలనలో అందరూ ప్రశాంతంగా ఉన్నారన్న హోంమంత్రి.. ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సలీమ్​ను కూడా పెయిడ్ ఆర్టిస్టు అంటారా అని ప్రశ్నించారు. జగన్ పాలన ఎంత అద్భుతంగా ఉందంటే, పేదవాడికి పట్టెడు అన్నం దొరక్కపోయినా, గూండాల దాహానికి టీడీపీ కార్యకర్తల రక్తం, ఆకలైతే నరకడానికి పొలాల్లో పంటలు ఉన్నాయని ఆరోపించారు. ఫ్యాక్షన్ భూతాన్ని రాష్ట్రం మీద వదిలారాని లోకేశ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు.