‘జగన్’ స్కామ్ స్టార్..! వైసీపీ బాగోతం బయటకొచ్చింది: లోకేష్

| Edited By:

Aug 12, 2019 | 3:33 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏపీ గ్రామ వాలంటీర్ల స్కీమ్‌పై మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ సంచలనాత్మక కామెంట్స్ చేశారు. అంతేగాక సీఎం జగన్‌ను స్కామ్ స్టార్‌ అని విమర్శించారు. వాలంటీర్ల స్కీమ్‌ అనేది కుట్రని.. బాగోతం బయటపడిందని.. ఓ వీడియోను పెట్టి ట్వీట్ చేశారు. జగన్ ఆస్కార్‌ తప్పకుండా వస్తుందని.. అంతబాగా నటిస్తున్నారని ఘాటుగా ఆరోపణలు కురిపించారు. గ్రామ వాలంటీర్ల స్కామ్‌తో జగన్ రూ.12 కోట్ల ప్రజాధన దోపిడీకి తెరలేపారని ట్వీట్‌లో […]

జగన్ స్కామ్ స్టార్..! వైసీపీ బాగోతం బయటకొచ్చింది: లోకేష్
Follow us on

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏపీ గ్రామ వాలంటీర్ల స్కీమ్‌పై మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ సంచలనాత్మక కామెంట్స్ చేశారు. అంతేగాక సీఎం జగన్‌ను స్కామ్ స్టార్‌ అని విమర్శించారు. వాలంటీర్ల స్కీమ్‌ అనేది కుట్రని.. బాగోతం బయటపడిందని.. ఓ వీడియోను పెట్టి ట్వీట్ చేశారు. జగన్ ఆస్కార్‌ తప్పకుండా వస్తుందని.. అంతబాగా నటిస్తున్నారని ఘాటుగా ఆరోపణలు కురిపించారు. గ్రామ వాలంటీర్ల స్కామ్‌తో జగన్ రూ.12 కోట్ల ప్రజాధన దోపిడీకి తెరలేపారని ట్వీట్‌లో పేర్కొన్నారు. వాలంటీర్ల నియామకంలో కులం, మతం కన్నా.. వైసీపీ కార్యకర్తా.. లేదా అనేది మాత్రమే చూస్తున్నారని వ్యాఖ్యానించారు లోకేష్.