MLA Roja: విద్యుత్‌ ఉత్పత్తి పేరుతో అన్యాయం చేయొద్దు.. వ్యక్తిగతంగా విమర్శిస్తే మర్యాదగా ఉండదన్న రోజా

|

Jul 02, 2021 | 12:40 PM

YSRను కానీ, జగన్‌ను కానీ వ్యక్తిగతంగా విమర్శిస్తే మర్యాదగా ఉండదని తెలంగాణ మంత్రులను హెచ్చరించారు APIIC చైర్‌పర్సన్‌ రోజా. అక్రమంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ APకి అన్యాయం చేయాలని చూస్తే సహించబోమన్నారు.

MLA Roja: విద్యుత్‌ ఉత్పత్తి పేరుతో అన్యాయం చేయొద్దు.. వ్యక్తిగతంగా విమర్శిస్తే మర్యాదగా ఉండదన్న రోజా
Actress Mla Roja
Follow us on

YSRను కానీ, జగన్‌ను కానీ వ్యక్తిగతంగా విమర్శిస్తే మర్యాదగా ఉండదని తెలంగాణ మంత్రులను హెచ్చరించారు APIIC చైర్‌పర్సన్‌ రోజా. తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. శ్రీవారి ఆశీస్సులు, నగర నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో అనారోగ్యం నుండి కోలుకున్నాని అన్నారు. అయితే.. అక్రమంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ APకి అన్యాయం చేయాలని చూస్తే సహించబోమన్నారు. తెలంగాణ అక్రమంగా నీటి జలాలను వాడుకోవడం ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చెయ్యడమే అని తెలిపారు. ఏపీకీ అన్యాయం చేస్తే ముఖ్యమంత్రితో పాటు తాము సహించమని స్పష్టం చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఏర్పడిన జల వివాదాన్ని పరిష్కరించి.. తమ వాటాను తమకు కేటాయించాలని ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి షేకావత్‌కు సీఎం జగన్ లేఖ రాశారని అన్నారు.

ఏపీ నీటిని వినియోగిస్తూ చేస్తున్న విద్యుత్ ఉత్పాదన కృష్ణా నీటి బోర్డు నిర్ణయానికి వ్యతిరేకమని ఎమ్మెల్యే అన్నారు. కాగా.. నీటి విషయంలో ఏపీ ప్రభుత్వంపై.. YSRపై తెలంగాణకు చెందిన కొందరు మంత్రులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం విదితమే. ఈ వ్యాఖ్యలకు స్పందించిన MLA రోజా ఘాటుగా కౌంటరిచ్చారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళల భద్రత కోసం రాష్ట్రంలో సీఎం జగన్ దిశా చట్టం, యాప్, పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చారని తెలిపారు. మహిళల భద్రతను పట్టించుకోని చంద్రబాబును ప్రశ్నించని తెలుగు మహిళలు.. జగన్‌ను విమర్శించడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. మహిళలు కోసం జగన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తున్నారని చెప్పారు. కరోనా బారిన పడ్డ వారికి న్యాయం చేయాలంటూ బాబు దొంగ దీక్షలు చేశారని.. ఆయన చేసే దీక్షలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎమ్మెల్యే రోజా ఎద్దేవ చేశారు.

ఇవి కూడా చదవండి : Drug Racket: నిన్న టెర్రర్ లింక్.. ఇవాళ డ్రగ్స్ మాఫియా.. ఇద్దరు విదేశీ విద్యార్థులు అరెస్ట్

Hyderabad Metro Timings: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక పరుగుల సమయం మారింది.. గమనించారా..