తెలంగాణలో కొనసాగుతోన్న ఎమ్మెల్సీ పోలింగ్.. బంజారాహిల్స్‌లో ఓటు వేసిన మంత్రి కేటీఆర్
తెలంగాణలో రెండు పట్టభద్రుల శాసన మండలి స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. 12 కొత్త జిల్లాల పరిధిలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రశాంతంగా..
తెలంగాణలో రెండు పట్టభద్రుల శాసన మండలి స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. 12 కొత్త జిల్లాల పరిధిలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్, నల్గొండ – ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కలిపి 1,530 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేయగా.. 7,560 మంది సిబ్బందిని నియమించింది. రెండు నియోజకవర్గాల్లో భారీసంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలవడంతో బ్యాలెట్‌ను దినపత్రిక సైజులో ముద్రించారు. వీటికి అనుగుణంగా జంబో బ్యాలెట్ బాక్సులను రూపొందించారు. మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ నియోజకవర్గంలో 5,31,268 మంది, వరంగల్-ఖమ్మం- నల్లగొండ నియోజకవర్గంలో 5,05,565 మంది ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ నియోజకవర్గం నుంచి 93 మంది, వరంగల్- ఖమ్మం- నల్లగొండ నియోజకవర్గంలో 71 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
రెండు నియోజకవర్గాల పరిధిలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. 15వేల మందికిపైగా సిబ్బందిని మోహరించారు. సున్నితమైన ప్రాంతాల్లో అవసరం మేరకు అదనపు బలగాలను అందుబాటులో ఉంచారు. కాగా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఐటీ, పురపాలక శాక మంత్రి కేటీఆర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బంజారాహిల్స్ కార్పొరేటర్ మన్నెం కవిత షేక్ పేట్ తహసీల్దార్ కార్యాలయంలోని పోలింగ్ కేంద్రంలో మంత్రి కేటీఆర్ ఓటేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ విద్యావంతులంతా సమర్థులకే ఓటేయాలని కోరారు. ఓటు హక్కు ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వెళ్లాలన్నారు. విద్యావంతులు దూరంగా ఉంటారనే అపోహను తొలగించాలని చెప్పారు. మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Read More:
పులివెందులకు షర్మిల.. చిన్నాన్న వివేకానందరెడ్డి వర్థంతికి హాజరు.. జగన్‌తో షర్మిల భేటీపై ఆసక్తి
ఏపీలో మున్సిపల్ ఓట్ల లెక్కింపు ప్రారంభం.. మరికొద్దిసేపట్లో తొలి ఫలితం.. తీవ్ర ఉత్కంఠలో అభ్యర్థులు