టీడీపీ అధినేతపై చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేశారు మంత్రి కొడాలి నాని. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. మూడు రోజుల్లో ఎన్నికలు ఉండగా చంద్రబాబు, నిమ్మగడ్డ వాయిదా వేసి పారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త ఎన్నికల కమిషనర్ వచ్చాక మార్చిలో ప్రక్రియ కొనసాగిస్తే ఎక్కడా TDP గెలవదని లెక్కింపు ఆపేశారని తెలిపారు. CM జగన్‌మోహన్ రెడ్డి ఇంట్లోంచి బయటకు రాకుండా ఎన్నికల్లో పాల్గొన్నారని చెప్పారు. సీఎం జగన్‌ను ప్రజలు దీవిస్తుంటే చూడలేని ఈ చంద్రబాబు బహిష్కరణ అంటారని మంత్రి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
800 మంది TDP అభ్యర్థులు గెలిచారు.. వాళ్లందరూ చంద్రబాబుని ధిక్కరించినవాళ్లా? అని ప్రశ్నించారు. ఆ గెలిచిన వాళ్లలో ఒకరిని పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకోండి అని సూచించారు. తండ్రీకొడుకులు రోడ్లపై తిరిగి ప్రచారం చేసినా ప్రజలు పట్టించుకోలేదన్నారు. ప్రజలు సీఎం జగన్‌ను దీవిస్తుంటే చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని విమర్శించారు. TDP అధ్యక్షుడిగా చంద్రబాబుని తప్పించి.. మొన్న గెలిచిన ఎంపీటీసీ జడ్పీటీసీ ల్లో ఒకరిని పెట్టుకోండని సూచించారు.
తండ్రీకొడుకుల్ని నమ్ముకుంటే టీడీపీ మూత పడిపోవడం ఖాయమన్నారు. గంజాయి అమ్ముకునే అయ్యన్నపాత్రుడు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని.. నేను ఇంకా దారుణంగా భూతులు తిట్టగలనని.. మా సీఎం జగన్ అలాంటివి ప్రోత్సహించరని అన్నారు. కడుపు మంటతో నాపై ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని..అలాంటివాటిని పట్టించుకోకండని సీఎం చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఇంకోసారి టీడీపీ నేతలు ఎవరైనా సీఎం జగన్ పై నోరు జారితే సహించేది లేదని హెచ్చరించారు.
టీడీపీ అధికారంలోకి వచ్చేది లేదు.. వస్తుందని భ్రమ పడకండని హితవులు పలికారు. రాష్ట్రంలో జగన్ చిటికెన వేలు కూడా కదిపే వాడు ఎవడూ లేరని తదైన తరహాలో మాట్లాడారు మంత్రి కొడాలి నాని. చంద్రబాబు అధికారంలో ఉండగా విజయవాడలో కాల్ మనీ దందా నడిపించారు. చంద్రబాబుకి ఆడపిల్లలు లేరు కనుక టీడీపీ నేతలు సెక్స్ ర్యాకెట్ నడిపినా చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
ఈ రోజు రాష్ట్రంలో కనీసం గుట్కాలు, మట్కాలు కూడా సీఎం జగన్ ఒప్పుకోవడం లేదని.. ఎవరో హైదరాబాద్‌లో ఉంటూ విజయవాడలో అడ్రెస్ పెట్టాడు.. దీన్ని మాకు అపాదించే ప్రయత్నం చేస్తున్నారని.. ఇది సరికాదని అన్నారు. నేను భూతుల మంత్రిని అయితే.. చంద్రబాబు భూతులు తిట్టించుకునే ప్రతిపక్ష నాయకుడా..? అంటూ ఆయన ప్రశ్నించారు. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబు బహిరంగంగా ప్రజల్ని భూతులు తిట్టలేదా..? అంటూ కామెంట్స్ చేశారు. చంద్రబాబు కుప్పంలో రాజీనామా చెసి.. తిరిగి గెలిస్తే రాజకీయాలు వదిలేసి చంద్రబాబు బూట్లు తుడుస్తూ కూర్చుంటా అంటూ సవాలు విసిరారు.
ఇవి కూడా చదవండి: Revanth Reddy: రేవంత్‌రెడ్డి ఇంటి వద్ద హైటెన్షన్.. ఇంటి ముట్టడికి ప్రయత్నించిన టీఆర్ఎస్.. అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు..