AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారికి గీతోపదేశం చేసిన మంత్రి.. దుష్టశక్తుల చెప్పుడు మాటలు విని మోసపోవొద్దన్న బొత్స

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలిదశ పోలింగ్‌ ముగిసి, ఫలితాలు కూడా వచ్చేశాయి. ఈ నేపథ్యంలో వైసీపీ మద్దతుదారుల ఫలితాలపై..

వారికి గీతోపదేశం చేసిన మంత్రి.. దుష్టశక్తుల చెప్పుడు మాటలు విని మోసపోవొద్దన్న బొత్స
K Sammaiah
|

Updated on: Feb 10, 2021 | 4:33 PM

Share

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలిదశ పోలింగ్‌ ముగిసి, ఫలితాలు కూడా వచ్చేశాయి. ఈ నేపథ్యంలో వైసీపీ మద్దతుదారుల ఫలితాలపై మంత్రి బొత్స సత్యనారాయణ సంతృప్తి వ్యక్తం చేశారు. 82 శాతానికిపైగా వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారని మంత్రి బొత్స ప్రకటించారు. తొలిదశలో జరిగిన ఎన్నికల్లో 2,637 పంచాయతీల్లో తమ పార్టీ మద్దతుదారులు గెలుపొందారని వివరించారు. తమ మద్దతుదారులను గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

పంచాయతీ ఎన్నికల ఫలితాలపై తాడేపల్లిగూడెంలో మాట్లాడిన బొత్స.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీరుపై మండిపడ్డారు. చంద్రబాబు నోరు విప్పితే అబద్ధాలేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చెప్పింది అంకెల గారడీనేనని పేర్కొన్నారు. కిందపడినా.. పైనే ఉన్నట్లు చంద్రబాబు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా వాలంటీర్‌ వ్యవస్థను తీసుకొచ్చామని తెలిపారు. కొన్ని దుష్టశక్తులు వాలంటీర్‌ వ్యవస్థకు తూట్లు పొడవాలని చూస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారు.

సేవా దృక్పథంతో పనిచేసే వారికి రూ.5 వేలు గౌరవ వేతనం ఇస్తామని ముందే చెప్పామని గుర్తుచేశారు. ప్రతి ఇంటికి మేలు చేయాలనే ఉద్దేశంతోనే వాలంటీర్‌ వ్యవస్థ తీసుకొచ్చినట్లు తెలిపారు. సమాజంలో వాలంటీర్లకు మంచి గౌరవం ఉందని దాన్ని పాడుచేసుకోవద్దని సూచించారు. ఎవరో చెప్పిన మాటల్ని విని.. పక్కదారి పట్టొద్దని వాలంటీర్లకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మరిని మంచి పథకాలు అమలు చేయబోతున్నట్లు చెప్పారు.

Read more:

షర్మిలా.. తప్పు చేస్తున్నావు.. కథ, డైలాగ్, స్క్రీన్‌ప్లేను లీక్ చేసిన జగ్గారెడ్డి

Follow Us
బుధ సంచారం.. ఆ రాశుల వారికి ఇక పట్టిందల్లా బంగారమే..
బుధ సంచారం.. ఆ రాశుల వారికి ఇక పట్టిందల్లా బంగారమే..
మూత్రం పసుపు రంగులో వస్తోందా? ఈ సిగ్నల్‌ను లైట్ తీసుకోవద్దు!
మూత్రం పసుపు రంగులో వస్తోందా? ఈ సిగ్నల్‌ను లైట్ తీసుకోవద్దు!
ఆరోగ్యానికి ఏ నూనె మంచిది..? 90శాతం మందికి ఈ నిజాలు తెలియదు..
ఆరోగ్యానికి ఏ నూనె మంచిది..? 90శాతం మందికి ఈ నిజాలు తెలియదు..
వచ్చే ఎన్నికల్లో నా భార్య మౌనిక పోటీ చేస్తుంది: మంచు మనోజ్
వచ్చే ఎన్నికల్లో నా భార్య మౌనిక పోటీ చేస్తుంది: మంచు మనోజ్
ముఖానికి ఐస్‌ మసాజ్ చేస్తున్నారా?ఈ చిన్న చిట్కాలతో మీ చర్మం
ముఖానికి ఐస్‌ మసాజ్ చేస్తున్నారా?ఈ చిన్న చిట్కాలతో మీ చర్మం
వాషింగ్ మెషీన్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్ సగానికి సగం..
వాషింగ్ మెషీన్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్ సగానికి సగం..
హ్యాపీ రిటైర్మెంట్‌కు PF డబ్బు సరిపోతుందా?
హ్యాపీ రిటైర్మెంట్‌కు PF డబ్బు సరిపోతుందా?
ఏపీ ప్రజలకు తక్కువ ధరకే సరుకులు.. త్వరలో మినీ మార్టులు..
ఏపీ ప్రజలకు తక్కువ ధరకే సరుకులు.. త్వరలో మినీ మార్టులు..
టీమిండియా హెడ్ కోచ్‌పై పరోక్షంగా కోహ్లీ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా హెడ్ కోచ్‌పై పరోక్షంగా కోహ్లీ సంచలన వ్యాఖ్యలు
అగ్గిపెట్టెలాంటి ఇల్లు.. రూ. 66 వేల అద్దె.. బాల్కనీ వ్యూ చూస్తే
అగ్గిపెట్టెలాంటి ఇల్లు.. రూ. 66 వేల అద్దె.. బాల్కనీ వ్యూ చూస్తే