వారికి భారత్ లో ఉండే హక్కులేదుః కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి

నేషనల్ కాన్ఫరెన్సు అధినేత ఫరూక్ అబ్దుల్లా, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీలపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి సంచలన వ్యాఖ్యలు చేశారు.

వారికి భారత్ లో ఉండే హక్కులేదుః కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి
Follow us

|

Updated on: Oct 28, 2020 | 6:06 PM

పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. తాజాగా నేషనల్ కాన్ఫరెన్సు అధినేత ఫరూక్ అబ్దుల్లా, పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీలపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి సంచలన వ్యాఖ్యలు చేశారు. రద్దు చేసిన 370 సెక్షన్ ను పునరుద్ధరించాలని ఫరూక్ అబ్దుల్లా, మెహబూబాలు డిమాండ్ చేయడంపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలు భారతదేశంలో ఉండటానికి హక్కు లేదని జోషి వ్యాఖ్యానించారు. చైనా దేశం మనపై దాడి చేస్తున్న సమయంలో ఆ దేశ సహాయంతో ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని చెప్పడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

14 నెలల నిర్బంధంలో నుంచి విడుదలైన తర్వాత ఇటీవల తన మొదటి విలేకరుల సమావేశంలో మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్ జెండాను ఎగురవేయడానికి అనుమతించకపోతే, తమ పార్టీ భారత త్రివర్ణ పతకాన్ని కూడా ఎగురవేయదని ఆమె అన్నారు. గత ఏడాది ఆగస్టు 5 న రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ను రద్దు చేయడానికి ముందు, జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక జెండా, ప్రత్యేక రాజ్యాంగం ఉన్నాయి. ఆర్టికల్ -370 ను రద్దు చేయడం గురించి పీడీపీ అధ్యక్షుడు మెహబూబా ముఫ్తీ ఇటీవల చేసిన ప్రకటనపై గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రికి భారతదేశం,దేశ చట్టాలు నచ్చకపోతే, ముఫ్తీ కుటుంబం పాకిస్తాన్ దేశానికి వెళ్లాలని పటేల్ సూచించారు.