సొంత సీఎం కేండిడేట్‌పై మోదీ సెటైర్లు

బీహార్ ఎన్నికల ప్రచారంలో బుధవారం ఓ విచిత్రం జరిగింది. తాను ఎవరి తరపున అయితే ప్రచారానికి వచ్చారో.. అతనిపైనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సెటైర్లు వేశారు. ఆ తర్వాత కవరప్ చేసుకున్నారు.

సొంత సీఎం కేండిడేట్‌పై మోదీ సెటైర్లు
Rajesh Sharma

|

Oct 28, 2020 | 4:30 PM

Modi satires on own CM candidate: బీహార్ రాష్ట్రంలో బుధవారం ఒకవైపు మొదటి విడత పోలింగ్ జరుగుతుండగా.. మరోవైపు మలి విడతల్లో పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వంటి కీలక నేతల ప్రచారం కొనసాగుతోంది. అయితే.. మోదీ ప్రచారంలో బుధవారం ఓ ఆసక్తికరమైన విషయం చోటుచేసుకుంది. అధికార ఎన్డీయే కూటమి తరపున ప్రచారం చేస్తున్న మోదీ.. సిట్టింగ్ సీఎం నితీశ్ కుమార్‌కు ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేశారు. అయితే.. ఆ వెంటనే దాన్ని కవరప్ చేసుకునేందుకు మోదీ యత్నించారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ బుధవారం మిథిల ప్రాంతంలో బహిరంగ సభలో పాల్గొన్నారు. తన ప్రసంగంలో అయోధ్య అంశాన్ని తీసుకువచ్చిన మోదీ.. గత ఎన్నికల సందర్భంగా బీజేపీ వ్యతిరేక కూటమి నేతలు చేసిన ప్రసంగాలను ఉటంకించారు. అయోధ్యలో రామ మందిరం ఎప్పుడు కడతారంటూ గతంలో మహా ఘట్‌బంధన్ నేతలు తమను ఎద్దేవా చేశారని, ఇపుడు వారే అయోధ్య పరిణామాలపై ఆశ్చర్యచకితులై చూస్తున్నారని మోదీ అన్నారు. అయితే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్.. మోదీని ప్రధాన మంత్రిని చేసిన బీజేపీని కాదంటూ.. ఆర్జేడీ సారథ్యంలోని మహా ఘట్‌బంధన్‌లో చేరారు. ఆ కూటమి తరపున ప్రచారం నిర్వహించిన నితీశ్.. అయోధ్య అంశం ఆధారంగా బీజేపీని విమర్శించారు. అయోధ్యలో ఎప్పుడు గుడి కడతారన్న ప్రశ్నలకు బీజేపీ నేతల వద్ద సమాధానం వుండదని వ్యంగ్యోక్తులు విసిరారు.

తాజాగా మిథిలలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ అయోధ్య అంశాన్ని గుర్తు చేస్తూ.. 2015 నాటి అసెంబ్లీ ఎన్నికల ప్రచారాంశాలను ఉదహరించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం మొదలైన విషయాన్ని గుర్తు చేస్తూ .. గతంలో తమను ఎద్దేవా చేసిన నేతలే ఇపుడు తమను ప్రశంసిస్తున్నారంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అయితే.. అంతలో ఏమనుకున్నారో ఏమో.. వెంటనే ఆ వ్యాఖ్యలు నితీశ్ కుమార్‌కు ఇబ్బందికరంగా వుంటాయని గుర్తు కొచ్చినట్లు.. ఆ తర్వాత ప్రసంగంలో నితీశ్ కుమార్‌పై ప్రశంసలు కురిపించారు. నితీశ్ సారథ్యంలో బీహార్ రాష్ట్రం అభివృద్ధి చెందిందంటూ చెప్పుకొచ్చారు.

Also read: రైతు భరోసా కేంద్రాలపై గురుతర బాధ్యత.. జగన్ సంచలన నిర్ణయం

Also read: ఇళ్ళను ఆక్రమించుకుంటాం… టీడీపీ నేతల హెచ్చరిక

Also read: కొత్త సచివాలయ నిర్మాణానికి ‘సుప్రీం‘ ఓకే

Also read: పోతుల సునీత షాకింగ్ డెసిషన్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu