ట్విట్టర్ వివరణపై ఎంపీల ప్యాన‌ల్ అసంతృప్తి

ల‌డాఖ్‌లోని లేహ్ ప్రాంతం చైనాలో ఉన్న‌ట్లు చూపిస్తున్న ట్విట్ట‌ర్ సెట్టింగ్స్‌పై ఆ సంస్థ ఇచ్చిన క్లారిటీ ప‌ట్ల ఎంపీల ప్యాన‌ల్ అసంతృప్తి వ్య‌క్తం చేసింది. మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ఇచ్చిన వివ‌ర‌ణపై...

ట్విట్టర్ వివరణపై ఎంపీల ప్యాన‌ల్ అసంతృప్తి
Follow us

|

Updated on: Oct 28, 2020 | 4:37 PM

Twitter Pulled Up : భారతదేశంలోని సరిహద్దు ప్రదేశాలను పొరుగు దేశాల్లో చూపించడం నేరం. సరిగ్గా ఇలాంటి నేరాన్నే చేసింది సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్. ల‌డాఖ్‌లోని లేహ్ ప్రాంతం చైనాలో ఉన్న‌ట్లు చూపిస్తున్న ట్విట్ట‌ర్ సెట్టింగ్స్‌పై ఆ సంస్థ ఇచ్చిన క్లారిటీ ప‌ట్ల ఎంపీల ప్యాన‌ల్ అసంతృప్తి వ్య‌క్తం చేసింది. మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ఇచ్చిన వివ‌ర‌ణపై అంతృప్తిని వ్యక్తం చేసింది.

డేటా ర‌క్ష‌ణ అంశంపై ఏర్పాటు చేసిన పార్ల‌మెంట‌రీ ప్యాన‌ల్ అభిప్రాయ‌ప‌డింది. జ‌మ్మూక‌శ్మీర్‌కు చెందిన లేహ్ ప్రాంతం.. పీపుల్స్ రిప‌బ్లిక్ చైనాలో ఉన్న‌ట్లు ట్విట్ట‌ర్ త‌న సెట్టింగ్స్‌లో చూపిస్తున్న‌ది. దీని ప‌ట్ల భార‌త ప్ర‌భుత్వానికి చెందిన అబ్జ‌ర్వ‌ర్ రీస‌ర్చ్ ఫౌండేష‌న్‌ అభ్యంతరం వ్య‌క్తం చేసింది.

అయితే ఈ సమావేశంలో ట్విట్ట‌ర్ ప్రతినిధులు ఇచ్చిన వివ‌ర‌ణ అస‌మ‌గ్రంగా ఉంద‌ని క‌మిటీలోని స‌భ్యులంద‌రూ ఏక‌గ్రీవంగా ఆమోదించారు. ప్యాన‌ల్ చైర్మ‌న్ మీనాక్షి లేఖి దీనికి సంబంధించి ప్ర‌క‌ట‌న విడుదల చేశారు.

ల‌డాఖ్ చైనాలో ఉన్న‌ట్లు చూపించడం క్రిమిన‌ల్ నేరం అవుతుంద‌ని మీనాక్షి లేఖి అభిప్రాయపడ్డారు. ఇందుకు భారత చట్టం ప్రకారం ఏడేళ్ల శిక్ష కూడా విధించే అవ‌కాశాలు ఉన్న‌ట్లు చెప్పారు. అయితే భార‌త సున్నిత అంశాల‌ను గౌర‌విస్తామ‌ని ట్విట్ట‌ర్ సంస్థ వెల్ల‌డించిన‌ట్లు లేఖి తెలిపారు. ఇది సున్నిత‌మైన అంశ‌మే కాదు, ఇది భార‌త దేశ సార్వ‌భౌమ‌త్వానికి, స‌మ‌గ్ర‌త‌కు సంబంధించిన‌ద‌ని లేఖి అన్నారు.

ఇక ట్విట్ట‌ర్ ఇండియా త‌ర‌పున సీనియ‌ర్ మేనేజ‌ర్ షాగుఫ్తా క‌మ్రాన్‌, లీగ‌ల్ కౌన్సిల్ అయుషీ క‌పూర్‌, పాల‌సీ క‌మ్యూనికేష‌న్స్ ప‌ల్ల‌వి వాలియాలు, కార్పొరేట్ సెక్యూర్టీ మ‌న్వింద‌ర్ బాలీలు ఉన్నారు. కేంద్ర ఎల‌క్ట్రానిక్స్‌, ఐటీశాఖ‌, న్యాయ‌శాఖ అధికారులు కూడా ప్యాన‌ల్ భేటీలో పాల్గొన్నారు. సాంకేతిక లోపం వ‌ల్ల ట్విట్ట‌ర్ సెట్టింగ్‌లో త‌ప్పుజ‌రిగిన‌ట్లు ట్విట్ట‌ర్ ఇండియా గ‌త వారం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ వివాదాన్ని  ట్విట్టర్ ఎలా ముగిస్తుందో చూాడాలి.