14 రోజుల్లో 100 ర్యాలీలు.. మమత బిజీ షెడ్యూల్

వెస్ట్ బెంగాల్ : తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ఏప్రిల్‌ 4వ తేదీ నుంచి ఎన్నికల రణభేరి మ్రోగించనున్నారు. మమతా బెనర్జీ బెంగాల్‌లోని 42 లోక్‌సభ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఏప్రిల్‌ 4 నుంచి మే 17వ తేదీ వరకు ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కేవలం 14 రోజుల్లో 100 ర్యాలీల్లో మమతా బెనర్జీ పాల్గొనలా షెడ్యూల్ సిద్ధమైంది. ప్రతి నియోజకవర్గంలో కనీసం […]

14 రోజుల్లో 100 ర్యాలీలు.. మమత బిజీ షెడ్యూల్

Edited By:

Updated on: Mar 28, 2019 | 6:46 PM

వెస్ట్ బెంగాల్ : తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ఏప్రిల్‌ 4వ తేదీ నుంచి ఎన్నికల రణభేరి మ్రోగించనున్నారు. మమతా బెనర్జీ బెంగాల్‌లోని 42 లోక్‌సభ నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఏప్రిల్‌ 4 నుంచి మే 17వ తేదీ వరకు ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కేవలం 14 రోజుల్లో 100 ర్యాలీల్లో మమతా బెనర్జీ పాల్గొనలా షెడ్యూల్ సిద్ధమైంది. ప్రతి నియోజకవర్గంలో కనీసం రెండు ర్యాలీలు నిర్వహించేలా పార్టీ నేతలు షెడ్యూల్ ను ఖరారు చేశారు. కాగా.. తృణమూల్‌ కాంగ్రెస్‌ అసోంలో ఆరు స్థానాల్లో, జార్ఖండ్‌లో మూడు, బీహార్‌లో రెండు, అండమాన్‌లో ఒక స్థానంలో పోటీ చేస్తోంది. ఇక్కడ కూడా మమతా బెనర్జీ ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నారు.