కేటీఆర్‌పై నారా లోకేష్ తీవ్ర ఆరోపణలు

కేటీఆర్‌పై నారా లోకేష్ తీవ్ర ఆరోపణలు

ఏపీ మంత్రి నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. జగన్‌పై విమర్శల దాడిని ఎక్కు పెట్టడంతో పాటు టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై కూడా విరుచుకుపడుతున్నాడు. జగన్ పేరును కల్వకుంట్ల జగన్ మోడీ రెడ్డిగా మార్చుకోవాలని ఏపీ మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ అభ్యర్ధులకు ఫోన్ […]

Ram Naramaneni

| Edited By: Anil kumar poka

Mar 27, 2019 | 7:52 PM

ఏపీ మంత్రి నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. జగన్‌పై విమర్శల దాడిని ఎక్కు పెట్టడంతో పాటు టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై కూడా విరుచుకుపడుతున్నాడు. జగన్ పేరును కల్వకుంట్ల జగన్ మోడీ రెడ్డిగా మార్చుకోవాలని ఏపీ మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ అభ్యర్ధులకు ఫోన్ చేసి ఆయన భయపెడుతున్నారని అన్నారు. పోలవరం ముంపు మండలాలను వెనక్కి తీసుకోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి స్విచ్ కేసీఆర్ వద్ద ఉందని అన్నారు. ప్రధాని మోడీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా మోసం చేశాడని మండిపడ్డారు

‘భారతదేశంలో ఆంధ్రాలో తప్ప ఎక్కడా రూ.2000 పెన్షన్ ఇవ్వడం లేదు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం చంద్రబాబు 120 పథకాలు పెట్టారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. పంచాయితీ రాజ్ శాఖలో ఎప్పుడూ లేని విధంగా అభివృద్ధి చేశారు. సంక్షేమం, అభివృద్ధి రెండూ టీడీపీకి జోడెడ్ల లాంటివి. ప్రత్యేక హోదాను మోడీ నీరుగార్చారు. భారీ మెజార్టీతో టీడీపీని గెలిపిస్తే.. భారతదేశ భావి ప్రధానమంత్రి ఎవరో చంద్రబాబు నాయుడు నిర్ణయిస్తారు’.. అని లోకేష్ వ్యాఖ్యానించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu