మంగళగిరిలో లక్ష్మీ పార్వతి ఎన్నికల ప్రచారం

జగన్‌ ప్రజల కోసం సొంత పార్టీ పెట్టి నడుపుతుంటే.. చంద్రబాబు మాత్రం మామయ్యను వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్‌ పార్టీని తన సొంత పార్టీ అని చెప్పుకుంటున్నాడని వైసీపీ నాయకురాలు ఆరోపించారు. చంద్రబాబు రాజధాని పేరుతో సింగపూర్‌ కంపెనీలకు భూమి అమ్మేస్తూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని  అన్నారు. బుధవారం మంగళగిరి మండలం యర్రబాలెంలో వైసీపీ అభ్యర్ధి, మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తరుపున ఆమె ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతు సమస్యలపై […]

  • Ram Naramaneni
  • Publish Date - 8:38 pm, Wed, 3 April 19
మంగళగిరిలో లక్ష్మీ పార్వతి ఎన్నికల ప్రచారం

జగన్‌ ప్రజల కోసం సొంత పార్టీ పెట్టి నడుపుతుంటే.. చంద్రబాబు మాత్రం మామయ్యను వెన్నుపోటు పొడిచి ఎన్టీఆర్‌ పార్టీని తన సొంత పార్టీ అని చెప్పుకుంటున్నాడని వైసీపీ నాయకురాలు ఆరోపించారు. చంద్రబాబు రాజధాని పేరుతో సింగపూర్‌ కంపెనీలకు భూమి అమ్మేస్తూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని  అన్నారు. బుధవారం మంగళగిరి మండలం యర్రబాలెంలో వైసీపీ అభ్యర్ధి, మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి తరుపున ఆమె ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతు సమస్యలపై నిరంతరం పోరాడిన, పోరాడుతున్న వ్యక్తి ఆళ్ల రామకృష్ణా రెడ్డి అని కొనియాడారు. జగన్‌పై అనేక కేసులు పెట్టినా ప్రజల కోసం పోరాడాడని, చివరికి జగన్‌పై హత్యాయత్నం కూడా చేయించిన ఘనుడు చంద్రబాబు అని విమర్శనాస్త్రాలు సంధించారు.  చంద్రబాబు నాయుడికి మతిమరుపు వ్యాధి వచ్చిందని, అందుకే కాసేపు ప్యాకేజీ కావాలంటాడు, కాసేపు ప్రత్యేక హోదా అంటాడని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో ఇచ్చిన  హామీలన్నీ మతిమరుపుతో ఎన్నికలు అయిపోగానే మరిచిపోతాడని వ్యాఖ్యానించారు. లోకేష్‌ని మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిపించాలని డబ్బును విచ్చవిడిగా ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. మంగళగిరి ప్రజలు నీతి నిజాయతీ గల వ్యక్తులు అని, ఎవరికి ఓటువేయాలో వారికి తెలుసునన్నారు.