Kondali Nani Vs SEC : ఏపీ మంత్రి కొడాలి నానికి హైకోర్టులో ఊరట, SEC ఆదేశాలను తప్పుబట్టిన ధర్మాసనం

|

Feb 18, 2021 | 1:44 PM

ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నానికి హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 21వ తేదీ వరకు ఆయన మీడియాతో మాట్లాడొద్దన్న SEC ఆదేశాలను ధర్మాసనం తప్పుబట్టింది...

Kondali Nani Vs SEC : ఏపీ మంత్రి కొడాలి నానికి హైకోర్టులో ఊరట, SEC ఆదేశాలను తప్పుబట్టిన ధర్మాసనం
Follow us on

ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నానికి హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 21వ తేదీ వరకు ఆయన మీడియాతో మాట్లాడొద్దన్న SEC ఆదేశాలను ధర్మాసనం తప్పుబట్టింది. కొడాలి నాని మీడియాతో మాట్లాడొచ్చని స్పష్టం చేసింది. అయితే SECపై, ఎన్నికల ప్రక్రియపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేసింది. ఇలా ఉండగా, ఈ నెల 12వ తేదీన తాడేపల్లి వైసీపీ ఆఫీస్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరును తప్పుబట్టారు కొడాలి నాని. ఆ తర్వాత గంటలోనే ఆయనకు షోకాజ్‌ నోటీసు జారీ అయింది. డెడ్‌లైన్‌ కంటే ముందే కొడాలి నాని వివరణ ఇచ్చారు. దానిపై సంతృప్తి చెందని నిమ్మగడ్డ 21వ తేదీ వరకు మీడియాతో మాట్లాడొద్దని ఆదేశించారు. దానిపై హైకోర్టుకు వెళ్లారు కొడాలి నాని. ఇప్పుడు ఆయనకు ఊరటనిస్తూ తీర్పు చెప్పింది ధర్మాసనం.

Read also : న్యాయవాద దంపతులు వామన్ రావు, నాగమణి హత్యలకు దారితీసిన పరిస్థితులు.? కుంటశ్రీనుకు ముడిపడిన అంశాలు.!