కవితకు షాక్ ఇచ్చిన పసుపు రైతులు…

అనుకున్నట్లు గానే నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులు తమ పంతం నెగ్గించుకునేలా ఉన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలన్న తమ ప్రధాన డిమాండ్ తో పాటు తమ ఉత్పత్తులకు కనీస ధర వచ్చేలా చూడాలంటూ.. ఏకంగా వారణాసిలో ప్రధాని మోదీపైనే బరిలోకి దిగారు. తమ నామినేషన్లను సమర్పించారు. వీరి ప్రభావం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించి కవిత వెనుకంజకు దారితీస్తున్నట్లు అర్ధమవుతోంది. ఇక కవితపై బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ దూసుకుపోతున్నారు. అరవింద్, కవితపై 53,000 ఓట్ల […]

కవితకు షాక్ ఇచ్చిన పసుపు రైతులు...
Follow us

| Edited By:

Updated on: May 23, 2019 | 12:52 PM

అనుకున్నట్లు గానే నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతులు తమ పంతం నెగ్గించుకునేలా ఉన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలన్న తమ ప్రధాన డిమాండ్ తో పాటు తమ ఉత్పత్తులకు కనీస ధర వచ్చేలా చూడాలంటూ.. ఏకంగా వారణాసిలో ప్రధాని మోదీపైనే బరిలోకి దిగారు. తమ నామినేషన్లను సమర్పించారు. వీరి ప్రభావం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించి కవిత వెనుకంజకు దారితీస్తున్నట్లు అర్ధమవుతోంది.

ఇక కవితపై బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ దూసుకుపోతున్నారు. అరవింద్, కవితపై 53,000 ఓట్ల తేడాతో దూసుకెళ్తున్నారు. నిజామాబాద్‌లో టీఆర్ఎస్ తరపున కవిత బరిలోకి దిగగా.. బీజేపీ నుంచి డీఎస్ కుమారుడు అరవింద్, ఇంకోవైపు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ పోటీ చేస్తున్నారు. వీరితోపాటు 178 మంది రైతులు కూడా పోటీలో ఉన్నారు.